స్థాయి మరచి సీఎం మాట్లాడారు: లెఫ్ట్
హైదరాబాద్: కార్మిక సంఘాలు మొక్కవోని దీక్షతో సమ్మె చేస్తే, అందుకు వామపక్షాలు, ఇతర పార్టీలు మద్దతు తెలపడంతో జీతాలు పెంచక తప్పని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తమ స్థాయిని మరచి చౌకబారుగా మాట్లాడుతున్నారని పది వామపక్షాలు ధ్వజమెత్తాయి. మున్సిపల్ కార్మికులకు ఇదివరకే వేతనాలు పెంచుతానని తాను చెప్పినా ఓపికలేక రాజకీయపార్టీలు, కార్మికసంఘాలు కుట్రపూరితంగా సమ్మె చేశాయని సీఎం పేర్కొనడాన్ని ఖండించాయి. శనివారం ఎంబీభవన్‌లో తమ్మినేని వీరభద్రం(సీపీఎం), ఈర్ల నర్సింహ (సీపీఐ), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), చలపతిరావు (న్యూడెమోక్రసీ), వనం సుధాకర్ (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), కె.దయానంద్ (ఫార్వర్డ్‌బ్లాక్), రాజేశ్ (లిబరేషన్) సమావేశయమయ్యారు. అనంతరం తమ్మినేనితో పాటు పలువురు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఇంకా ఆ సెంటిమెంట్‌ను ఉపయోగించుకునేందుకు ఆంధ్ర పార్టీలంటూ వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించాయి.
గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామీణాభివృద్ధి ఉద్యోగులు, జిల్లాల్లోని మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా ఈ నెల 20-24 తేదీల మధ్య జిల్లాల్లో పది వామపక్షాల ఆధ్వర్యంలో బస్సు జాతాను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బస్సుజాతా ముగింపు సందర్భంగా 24న ఇందిరాపార్కు వద్ద బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. 20న నల్లగొం డలో బస్సుజాతాను ప్రారం భిస్తున్నట్లు చెప్పారు. సీఎం కే సీఆర్ పాలనలో పోరాడితేనే వాగ్దానాలు, ఇతరత్రా సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టమైం దని తమ్మినేని అన్నారు. సీఎంకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జీహెచ్‌ఎంసీ కార్మికులకే జీతాలు పెంచడం ఏ విధంగా న్యాయం, దానిని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.