'కేసీఆర్‌కు వెన్నెముక లేదు'
'కేసీఆర్‌కు వెన్నెముక లేదు'
Published Thu, May 25 2017 3:38 PM | Last Updated on Thu, Jul 11 2019 9:08 PM
నల్లగొండ: కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులే ఇస్తూ అవమానపర్చేలా మాట్లాడటం అమిత్ షాకు తగదని సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'మూడేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్రానికి రాష్ట్రం పన్నుల రూపంలో ఇచ్చినవే ఎక్కువ. రాష్ట్రాలను కేంద్రం దోపిడీ చేస్తోంది. కేసీఆర్‌కు కేంద్రంతో పోరాడేందుకు వెన్నెముక లేదు. అందుకే అమిత్‌షాను తిడుతూ మోదీని పొగుడుతున్నారు. కేసీఆర్‌కు ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని చెప్పాలి.
కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వాటిని ఏయే పథకాలకు ఖర్చు చేశారు అన్నదానిపై కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలి. దేశవ్యాప్తంగా దళితుల మీద, వారి ఆహారం మీద విమర్శలు చేస్తూ.. దళిత వాడల్లో భోజనాలు చేస్తే పాపం పోదు. ఎక్కడో వండిన వంటలను దళిత వాడల్లో తింటే దళితుల బోజనం తిన్నట్టు కాదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక అగ్రకుల అమ్మాయిని ప్రేమించిన బీసీ యువకుడు 23 రోజులుగా అదృశ్యమైతే కేసీఆర్, అమిత్‌షా ఎందుకు నోరు మెదప లేదు. ఇటువంటి ఘటనలు అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం గురించి చెప్పడం విడ్డూరంగా ఉంది. స్వాతంత్ర్య పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం తో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు' అన్నారు.
Advertisement