సింగరేణిలో 'గుర్తింపు' ఎన్నికల ప్రక్రియ షురూ
సింగరేణిలో 'గుర్తింపు' ఎన్నికల ప్రక్రియ షురూ
Published Wed, Aug 24 2016 4:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
- నేడు కార్మిక సంఘాలతో ఆర్‌ఎల్‌సీ భేటీ
- యూనియన్ల సభ్యత్వం, ఆడిటింగ్‌పై దృష్టి
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 5వ దఫా ఎన్నికలు జరిగిన తేదీ ప్రకారం ఈ ఏడాది జూన్ 29తో టీబీజీకేఎస్ గుర్తింపు కాలపరిమితి ముగిసింది. అరుుతే అధికారికంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చింది 2012 ఆగస్టు 6న కావడంతో ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయని అందరూ ఆశించారు. కార్మిక సంఘాలు సైతం ముందస్తుగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోరుు గనులపై ప్రచారం ప్రారంభించారు. రాష్ర్టంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ సైతం తన అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌కు నూతన కమిటీని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో గుర్తింపు ఎన్నికలకు సింగరేణి యూజమాన్యం సైతం ముందుకు వచ్చింది. కార్మికుల సంఘాలతో రీజినల్ లేబర్ కమిషనర్(ఆర్‌ఎస్‌సీ) మంగళవారం కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథి గృహంలో సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఎన్నికల నిర్వహణపై కార్మిక సంఘాల ప్రతిపాదనలు తీసుకోనున్నారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఖరారు కానుంది. గత ఎన్నికల్లో మొత్తం 15 సంఘాలు పోటీపడగా 60,247 మంది ఓటర్లు ఉన్నారు. ఆరో దఫా ఎన్నికల్లో 58,760 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నా రు. ఈ దఫా ఎన్ని సంఘాలు పోటీ పడతాయనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది.
సంఘాల కార్యకలాపాల పరిశీలన
గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్న యూనియన్ల కార్యకలాపాలను ఆర్‌ఎల్‌సీ అధికారులు పరిశీలించనున్నారు. ప్రధానంగా యూనియన్ సభ్యత్వం, ఆడిటింగ్‌పై దృష్టి సారించనున్నారు. ట్రేడ్ యూనియన్ నిబంధనల ప్రకారం యాక్టివ్‌గా ఉన్న యూనియన్లను పోటీలో నిలిపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన కొన్ని యూనియన్లు ఇప్పటి కే సింగరేణిలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఈ దఫా పోటీ చేసే యూనియన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తొలుత కేవలం 12 సంఘాలకు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆర్‌ఎల్‌సీ ప్రకటించింది. మూడు సంఘాలు కోర్టుకు వెళ్లి పోటీ చేసే అవకాశాన్ని తెచ్చుకున్నాయి.
సెప్టెంబర్‌లో ఎన్నికలు..
రెండు నెలలుగా కురిసిన వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడిన సింగరేణి సంస్థ గుర్తింపు ఎన్నికలను సెప్టెంబర్‌లోనే పూర్తి చేసి ఉత్పత్తి లక్ష్యసాధనపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు కీలకమైన సమావేశం మంగళవారం ముగియనుండటంతో ఆ తర్వాత ఎన్నికల తేదీని ప్రకటించేం దుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement