ఆర్టీసీలో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లే. దానిని 60 ఏళ్లకు పెంచాలని చంద్రబాబును వేడుకున్నారు. మా జీవితాలు కూడా బాగుపడతాయి, మేం కూడా ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నాం కదా, మాక్కూడా రిటైర్మెంట్ వయస్సు పెంచండి అని అంటే చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లు అడక్కపోయినా కూడా రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలకు పెంచుతూ ముందుగానే ఆదేశాలు జారీ చేశాం. ఆ తర్వాతే విలీన ప్రక్రియ మొదలుపెట్టాం.