ఎగిసిన సమైక్యం | united agitation become severe in nellore district | Sakshi
Sakshi News home page

ఎగిసిన సమైక్యం

Published Thu, Feb 13 2014 3:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

united agitation become severe in nellore district

సాక్షి, నెల్లూరు : జిల్లాలో సమైక్య పోరు హోరెత్తుతోంది. ఎన్‌జీఓలు, సమైక్యవాదులు ఏడోరోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు నిర్వహించారు.    ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు కొనసాగించారు. పార్లమెంట్‌లో విభజన బిల్లు పెడుతున్నందుకు నిరసనగా గురువారం జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చా రు. ఎన్‌జీఓల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టడం దుర్మార్గమైన చర్యగా ఎన్‌జీఓలు అభివర్ణించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చింతారెడ్డిపాళెం జాతీయ రహదారిపై
 
 ఆందోళనకారులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు.  కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సమైక్య నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య, కాంగ్రెస్ నేత రంగమయూర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ఏపీఎన్‌జీఓలు బుధవారం ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ కార్యాలయాలను మూయించారు. వాకాడులో ఆర్టీసీ డిపో కార్మికులు డిపో ఎదుట నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం ఎన్‌జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం మద్దూరుపాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉదయగిరిలో ఆర్టీసీ డిపో ఎదుట ఎన్‌ఎంయూ కార్మికులు ధర్నా నిర్వహించారు.
 
Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement