యాదమరి: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి నందుకు రూ.200 కోట్లు నష్టం వచ్చిందని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆరోపించారు. ఆయన గురువారం విలేకరితో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్ 43 శాతం ఇవ్వాలని ముందే అడిగారనీ,ఇవ్వకపోతే సమ్మె చేస్తామని హెచ్చరికలు చేసినా ప్రభుత్వం వీరి సమస్యలు పట్టించుకోకుండా పోవడంతో వారు ఎనిమిది రోజులుగా సమ్మె చేశారు. ప్రయాణికుల సమస్యలను చూడలేక వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందన్నారు. సమ్మె కాలంలో వాటిల్లిన దాదాపు రూ.200 కోట్ల నష్టం ప్రభుత్వం భరించాలని పేర్కొన్నారు.
నేడు సప్లై ఛానల్ పరిశీలన
మండలంలోని నేరేనగర్ ముస్లింవాడ గ్రామం నుంచి శ్మశాన స్థలానికి వెళ్లే సప్లై ఛానల్‌ను పూతలపట్టు నియోజక వర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జెడ్పీటీసీ ఉషారాణి, ఎంపీపీ రాధమ్మ , వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలు,సర్పంచ్‌లు పరిశీలించనున్నట్లు మండల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు ధనంజయరెడ్డి తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు రూ. 200 కోట్లు
Published Fri, May 15 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement