MLA sunilkumar
-
పింఛన్ల కోసం ప్రశ్నిస్తే సునీల్‌పై కేసులా?
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు! 40 ఏళ్లలో ఇలాంటి ప్రజాకంటక పాలన చూడలేదు పలమనేరు: అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీడీవోను కోరిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌పై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టించడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్ సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. పలమనేరులో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ స్వగృహంలో గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆయన జోస్యం చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రజాకంటక పాలన చూడలేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీ అంటే ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజాపాలన అంటే కేవలం పోలీసులు, కేసులే అనుకుంటున్నారన్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యే సునీల్ ఎంపీడీవోను ప్రశ్నిస్తే అక్కడ పనిచేసే సిబ్బందితో నాన్‌బెయిల్ కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇలాంటి సంఘటనలతో దళితులపై ఆయన ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్థం అవుతోందన్నారు. తమ ఎమ్మెల్యేపై తప్పుడు కేసుపెట్టినంత మాత్రాన ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగుఎక్కువ అన్నట్టు ఓడిపోయే పార్టీ నాయకుడికి లేనిపోనీ తెలివితేటలొచ్చినట్టున్నాయని విమర్శించారు. స్థానిక కో–ఆర్డినేటర్లు సీవీ కుమార్, రాకేష్‌రెడ్డితో పాటు, పట్టణ, మండల కన్వినర్లు‡ మండీ సుధా, బాలాజీ నాయు డు, రాష్ట్ర కార్యదర్శులు మురళీకృష్ణ, మొగసాల కృష్ణమూర్తి, నాయకులు వెంకటేగౌడ, దయానంద్‌గౌడ, చెంగారెడ్డి, రెడ్డెప్ప, ప్రహ్లాద, మోహన్‌రెడ్డి, నాగరాజు, శ్యామ్‌సుందర్‌రాజు, కిరణ్ పాల్గొన్నారు. ప్రశ్నించినందుకు కేసులు ఐరాల : అర్హులకు పింఛన్ల పంపిణీలో అవకతవకులపై అధికారులను ప్రశ్నిం చినందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మరో ముగ్గురు నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు. అధికార పార్టీకి చెందిన నేతల అండతో కేసులు బనాయించారని మండల ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజల పక్షాన ఉండే అధికారులకు అండగా ఉంటాం.. సునీల్‌కుమార్ ఐరాల (కొండేపల్లె) : ప్రజల పక్షాన ఉండే అధికారులకు ఎన్ని ఒత్తిళ్లు, వేధింపులు ఎదురైనా వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సునీల్ అన్నారు. ఆయన గురువారం ఐరాల మండలంలోని కొండేపల్లెలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఐరాల మండలానికి 330 ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు అయితే వాటిలో వంద పింఛన్లను ఒకే సామాజిక వర్గానికి మంజూరు చేయడం సబబేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జిల్లా అధికారుల సూచనల మేరకు మండలంలో 80 శాతం అర్హత ఉన్న వారికి పింఛన్ అందించాలని 30 మంది వివరాలు అందజేస్తే వాటిలో కనీసం ఒక్కరికి కూడా మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఈవిషయంపై నిలదీస్తే కొందరు అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తమపై కేసులు బనాయించారని ఆరోపించారు. ఎంపీడీవో, ఉద్యోగుల చేత ఆందోళన చేయించడం తగదని వారికి ఎమ్మెల్యే హితవు పలికారు. -
రాష్ట్రానికి స్వాతంత్య్రం రాలేదు
– ప్రతి పనికీ లంచం – అడుగడుగునా అవినీతి – పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ యాదమరి : 70 ఏళ్ల క్రితం దేశానికి మాత్రమే స్వాతంత్య్రం వచ్చిందని, ఆంధ్ర రాష్ట్రానికి రాలేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. యాదమరి ఎంపీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నపని కూడా లంచం లేనిదే కావడం లేదన్నారు. అందుకే వనరులు ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదన్నారు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు డిజిటల్ ఫొటోలు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా పుష్కరాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అయినా సౌకర్యాలు సరిగా లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధి అంతా ప్రకటనలకే పరిమితమైందని, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు నిజాలు తెలుసుకుని బుద్ధి చెప్పే రోజు ముందు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు ఉషా, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు ధనంజయరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ శంకర్ నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహర్, కో–ఆప్షన్ సభ్యులు ముస్తఫా పాల్గొన్నారు. -
చంద్రబాబు అవినీతిపై పోరాటం ఆగదు
► ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ► ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకం ఆవిష్కరణ బంగారుపాళ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు, చేస్తున్న అవినీతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై రూపొందించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’పుస్తకాన్ని బంగారుపాళ్యం మం డలంలోని పాలేరు గ్రామంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లయినా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రాజధాని, ప్రాజెక్టు నిర్మాణాల పేరుతో లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా వెనకేసుకున్నారని ఆరోపించా రు. ఆ అవినీతి సొమ్ముతోనే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించడంలో విఫలమయ్యారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మ్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతి పై రూపొందించిన పుస్తకాన్ని త్వరలోనే తెలుగులోకి అనువదించి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. వైఎస్సార్సీపీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్‌రాజా మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ప్రజలు వైఎస్సార్సీపీ పక్షాన ఉన్నారనీ, రాను న్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎన్నికల ఖర్చుకు అదనంగా..రూ.10 కోట్లిస్తారట..
అధికార పార్టీ ప్రలోభాల పర్వాన్ని బయటపెట్టిన పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు అడ్డదారిలో అధికార టీడీపీ చేస్తున్న యత్నాలను వైఎస్సార్ సీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ బయటపెట్టారు. టీడీపీలో చేరాలంటూ తనను ప్రలోభపెట్టేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని, నెలరోజులుగా వివిధ నంబర్ల నుంచి ఫోన్లు చేసి బేరసారాలు సాగిస్తున్నారని, గత ఎన్నికల్లో చేసిన ఖర్చు కాకుండా.. అదనంగా మరో రూ.పదికోట్లు ఇస్తామని చెబుతున్నారని ఆయన వెల్లడించారు.ఆయన ఆదివా రం చిత్తూరు జిల్లా ఐరాలలో విలేకరులతో మాట్లాడారు.చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు ఫోన్లు చేస్తూ తనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ‘‘మేం ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండి.. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. కొత్తగా ఎన్నికయ్యారు.. డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీరు అనుకుంటున్న పనులు ఏవీ జరగట్లేదు. మరోలా అనుకోకుంటే మీరు గత ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తానికి అదనంగా మరో రూ.10 కోట్లు ఇస్తాం. ఎన్నికల్లో మీకు రూ.20 కోట్లు వరకు ఖర్చయి ఉంటుంది కదా! మీది బాబుగారి సొంత జిల్లా. మంచి భవిష్యత్తు, కెరీర్ ఉంటుంది. అన్నీ ఆయనే చూసుకుంటారు. డీలిమిటేషన్ జరుగుతుంది.. మీకు ఎమ్మెల్యే సీటు తప్పక ఇస్తాం.. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు.. జిల్లాలో ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు.. ముందు వచ్చిన వారికే ప్రయారిటీ ఉంటుంది.. వెంటనే వచ్చేయండి’’ అంటూ ఫోన్లలో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఒక నంబరునుంచి.. ఇంకోసారి ఇంకో నంబరునుంచి ఫోన్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. తనకు ఫోన్లు చేయొద్దని చెప్పినా.. ఇలా సిగ్గులేకుండా ఫోన్లు చేయడం తగునా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీని వీడను.. ‘‘నేను జగన్మోహన్రెడ్డి దయవల్లే ఎమ్మెల్యేనయ్యా. డాక్టరుగా ఉన్న నన్ను రాజకీయాలకు కొత్తయినా.. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆదరించారు. జిల్లా నాయకత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలువైన సూచనలు సలహాలిచ్చి నా విజయానికి ఎంతగానో తోడ్పాడ్డారు. వీరిద్దరే నాకు రాజకీయ గురువులు. రాజకీయాల్లో ఉన్నంతవరకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను’’ అని సునీల్‌కుమార్ స్పష్టం చేశారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీదు రూ. 200 కోట్లు
యాదమరి: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి నందుకు రూ.200 కోట్లు నష్టం వచ్చిందని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆరోపించారు. ఆయన గురువారం విలేకరితో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ 43 శాతం ఇవ్వాలని ముందే అడిగారనీ,ఇవ్వకపోతే సమ్మె చేస్తామని హెచ్చరికలు చేసినా ప్రభుత్వం వీరి సమస్యలు పట్టించుకోకుండా పోవడంతో వారు ఎనిమిది రోజులుగా సమ్మె చేశారు. ప్రయాణికుల సమస్యలను చూడలేక వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందన్నారు. సమ్మె కాలంలో వాటిల్లిన దాదాపు రూ.200 కోట్ల నష్టం ప్రభుత్వం భరించాలని పేర్కొన్నారు. నేడు సప్లై ఛానల్ పరిశీలన మండలంలోని నేరేనగర్ ముస్లింవాడ గ్రామం నుంచి శ్మశాన స్థలానికి వెళ్లే సప్లై ఛానల్‌ను పూతలపట్టు నియోజక వర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ జెడ్పీటీసీ ఉషారాణి, ఎంపీపీ రాధమ్మ , వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు,సర్పంచ్‌లు పరిశీలించనున్నట్లు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధనంజయరెడ్డి తెలిపారు. -
పేదల కడుపుకొట్టిన ఘనత చంద్రబాబుదే
ఐరాల: పింఛను ఆధారంగా బతికే పేదల పేర్లను జాబితా నుంచి తొలగించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో అర్హులందరికీ పింఛన్లు అందేవని, టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలను నిరాశ్రయులను చేయడమే పనిగా పింఛన్లను తొలగించి పస్తులకు గురిచేస్తుందని విమర్శించారు. 15 సంవత్సరాలుగా పింఛన్ తీసుకునే వృద్ధులు, వికలాంగుల పేర్లను సైతం తొలగించారని మండిపడ్డారు. గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి అర్థం లేని నిబంధనలను విధించి పేదల పొట్టకొడుతోందన్నారు. అధికారులు సైతం పెత్తన మంతా అధికార పార్టీ నేతల చేతుల్లో ఉంచి చోద్యం చూస్తున్నారన్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఏగ్రామంలో పర్యటించినా నిరుపేదలు కన్నీటి పర్యంతమవుతూ పింఛను ఇప్పించాలని కోరుతున్నారని తెలిపారు. తిండికి, మందులకు డబ్బులు లేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, పింఛన్ల పంపిణీలో రాజకీయ రంగు పులుము కోవడం దారుణమని ఆరోపించారు. రీసర్వే నిర్వహించండి పూతలపట్టు నియోజకవర్గ స్థాయిలో పింఛన్ల అర్హతపై రీ సర్వే చేయాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. తాను నిరాహర దీక్ష చేసే సమయంలో ఐరాల మండల వ్యాప్తంగా రెండు వందలకు పైగా పింఛను దారులు అక్రమంగా తొలగించారంటూ వినతి పత్రాలను ఇచ్చారన్నారు. వాటిని అధికారులకు అందజేసినా ఇప్పటి వరకు స్పందన లేదని మండిపడ్డారు. రీసర్వే చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలవనున్నట్లు ఆయన తెలిపారు. -
పింఛన్లను పునరుద్ధరించాలి
నిరవధిక నిరశనలో పూతలపట్టు ఎమ్మెల్యే దీక్షకు పలువురు {పముఖుల మద్దతు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంజూరుచేసిన పింఛన్లను తొలగించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఐరాల మండలంలో 500 మంది వికలాంగులు.. 80 మందికి పైగా వితంతువులు, వృద్ధుల నోటికాడ కూడు లాగేసింది. -డాక్టర్ సునీల్‌కుమార్, ఎమ్మెల్యే ఐరాల: మండలంలో తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. వివిధ వర్గాలకు సంబంధించిన పింఛన్ల తొలగింపును నిరసిస్తూ గురువారం ఐరాలలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మండలవ్యాప్తంగా ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కమిటీల ద్వారా తొలగించిన వారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. మండలంలో తొలగించిన పింఛన్లకు సంబంధించి అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవానికీ పొంతనే లేదన్నారు. మండలంలో మొత్తం 159 పింఛన్లు మాత్రమే తొలగించామని అధికారులు చెబుతుండగా, అనధికారికంగా వికలాంగులకు సంబంధించే మొత్తం 500 పింఛన్లు తొలగించేశారని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పింఛన్లను తొలగించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. అర్థంపర్థంలేని నియమాలు, నిబంధనలు అమలు చేసి ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరలివచ్చిన వికలాంగులు మండలం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు దీక్షా శిబిరానకి తరలివచ్చారు. తమకు అన్నిరకాల అర్హతలున్నా ప్రభుత్వం పింఛన్లు తొలగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను పొందేందుకు ధ్రువపత్రాల్లో 50 శాతం మేర అర్హతలు కలిగి ఉన్నా తమకు పింఛన్లు అందడం లేదని వారు ఎమ్మెల్యేకు తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయామంటూ ఈడిగపల్లికి చెందిన మంజుల,చిన్నకాంపల్లికి చెందిన నాగరాజు, చెంగనపల్లికి చెందిన బాలయ్య మొరపెట్టు కున్నారు. ప్రముఖుల మద్దతు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరాహరదీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్, శిరీష్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, నాయకులు రాజారత్నం రెడ్డి, సుబ్బారెడ్డి,వినయ్ రెడ్డి, కుమార్ రాజా, రామచంద్రారెడ్డి, శరత్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,పుత్రమద్ది బుజ్జిరెడ్డి,ప్రభాకర్ రెడ్డి,గణపతి,రాజేష్, సురేష్,భానూప్రకాష్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి,చిన్నారెడ్డి, టెరిన్ రెడ్డి,వికలాంగ జేఏసీ సభ్యులు చంద్ర శేఖర్,సర్పంచులు బుజ్జమ్మ,శ్రీనివాసులు, వెంకటేశు,ఎంపీటీసీ సభ్యురాలు చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే సొంత గ్రామస్తుడైతే పింఛన్ ఇవ్వరా?
ఐరాల: ‘ఎమ్మెల్యే సొంత గ్రామంలో నివాసముండే వారికి పింఛను ఇవ్వరా..?’ అంటూ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఎంపీడీవో పార్వతమ్మను ప్రశ్నించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎంపీడీవోను ఉద్దేశించి మాట్లాడారు. 20 ఏళ్లుగా పింఛన్ పొందుతున్న ఎంపైపల్లెకు చెందిన చెంగయ్యకు ఇటీవల కమిటీ సభ్యులు పింఛన్ తొలగించారన్నారు. ఆయన తనను సంప్రదించగా ఎంపీడీవోకు విన్నవించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఆయన మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ గ్రామానికి చెందిన వారు కావడంతో పింఛన్ తొలగించి ఉంటారని బాధితుడు ఆలోచిస్తూ మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. వయస్సు మీరిన వారిని ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎంపీడీవో పార్వతమ్మ స్పందిస్తూ కమిటీ తొలగించిన తరువాత నిజానిజాలు పరిశీలించి పింఛనుదారుడి వివరాలను జిల్లా అధికారులకు తెలియజేశామన్నారు. అనుమతి రాగానే పింఛను అందజేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు పుత్రమద్ది బుజ్జిరెడ్డి, గురుమూర్తి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, దళిత సంఘం నాయకులు సిద్దయ్య, చెంగపల్లి ఎంపీటీసీ చిలకమ్మ, చిన్నారెడ్డి, గుర్రప్ప, గణపతి, భానుప్రకాష్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, అయిరాల ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీనే బాస్ ఈ విషయంపై ఎంపీడీవో పార్వతమ్మను వివరణ కోరగా గతంలో ఉన్న ఎంపీడీవో, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కమిటీలో 160 మందిని అనర్హులుగా గుర్తించారని, ఆ తరువాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిని ఎమ్మార్వో సమక్షంలో పరిశీలించి తిరిగి నమోదు చేశామని తెలిపారు. వాటిని తొలగించడంలో చేర్చడంలో ఎంపీపీనే తమకు బాస్‌గా వ్యవహరించారని చెప్పారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తా సమావేశం అనంతరం ఎమ్మెల్యే సునీల్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆమరణ నిరాహర దీక్ష చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా అర్హత ఉండి పింఛను కోల్పోయిన వారందరూ హాజరు కావాలని కోరారు. -
నేడు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నా
యాదమరి : అక్రమ కేసు నమోదును నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10 గంట లకు ధర్నా చేయనున్నట్లు పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదమరి మండలం మోర్థనపల్లె సబ్‌స్టేషన్‌లో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ అకారణంగా తమను తొలగించారని అక్కడ విధులు నిర్వహిస్తున్న మొగలీష్, సతీష్, భాగ్యరాజ్ తెలియజేశారని తెలిపారు. వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో సోమవారం సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లాలని, ఆ సమయంలో అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ తప్ప అధికారులెవ్వరూ లేరని తెలి పారు. రికార్డులను పరిశీలిం చి ఎప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని అడిగానే తప్ప మరేమీ మాట్లాడలేదన్నారు. దీనిపై అదేరోజు ఆ గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన టీడీపీ నాయకులు రాద్ధాం తం చేశారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలు చేసి కేసు నమోదు చేరుుంచారని ఆరోపించా రు. మాజీ ఎంపీపీ ధనంజయులురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహరన్ మాట్లాడుతూ ధర్నా కార్య క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.