చంద్రబాబు అవినీతిపై పోరాటం ఆగదు
► ఎమ్మెల్యే సునీల్‌కుమార్
► ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకం ఆవిష్కరణ
బంగారుపాళ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలు, చేస్తున్న అవినీతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై రూపొందించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’పుస్తకాన్ని బంగారుపాళ్యం మం డలంలోని పాలేరు గ్రామంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టి రెండేళ్లయినా రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. రాజధాని, ప్రాజెక్టు నిర్మాణాల పేరుతో లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా వెనకేసుకున్నారని ఆరోపించా రు. ఆ అవినీతి సొమ్ముతోనే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే లేరని అన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించడంలో విఫలమయ్యారని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మ్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతి పై రూపొందించిన పుస్తకాన్ని త్వరలోనే తెలుగులోకి అనువదించి ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్‌రాజా మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి బడుగుబలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారనీ, రాను న్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.