ఎంపీపీ కార్యాయలంలో విలేకర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్
రాష్ట్రానికి స్వాతంత్య్రం రాలేదు
Published Mon, Aug 15 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
– ప్రతి పనికీ లంచం
– అడుగడుగునా అవినీతి
– పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్
యాదమరి : 70 ఏళ్ల క్రితం దేశానికి మాత్రమే స్వాతంత్య్రం వచ్చిందని, ఆంధ్ర రాష్ట్రానికి రాలేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. యాదమరి ఎంపీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నపని కూడా లంచం లేనిదే కావడం లేదన్నారు. అందుకే వనరులు ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదన్నారు. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు డిజిటల్ ఫొటోలు చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా పుష్కరాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అయినా సౌకర్యాలు సరిగా లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధి అంతా ప్రకటనలకే పరిమితమైందని, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు నిజాలు తెలుసుకుని బుద్ధి చెప్పే రోజు ముందు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు ఉషా, వైఎస్సార్ సీపీ మండలాధ్యక్షుడు ధనంజయరెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ శంకర్ నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహర్, కో–ఆప్షన్ సభ్యులు ముస్తఫా పాల్గొన్నారు.
Advertisement