ఐరాల: పింఛను ఆధారంగా బతికే పేదల పేర్లను జాబితా నుంచి తొలగించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో అర్హులందరికీ పింఛన్లు అందేవని, టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలను నిరాశ్రయులను చేయడమే పనిగా పింఛన్లను తొలగించి పస్తులకు గురిచేస్తుందని విమర్శించారు. 15 సంవత్సరాలుగా పింఛన్ తీసుకునే వృద్ధులు, వికలాంగుల పేర్లను సైతం తొలగించారని మండిపడ్డారు.
గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి అర్థం లేని నిబంధనలను విధించి పేదల పొట్టకొడుతోందన్నారు. అధికారులు సైతం పెత్తన మంతా అధికార పార్టీ నేతల చేతుల్లో ఉంచి చోద్యం చూస్తున్నారన్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఏగ్రామంలో పర్యటించినా నిరుపేదలు కన్నీటి పర్యంతమవుతూ పింఛను ఇప్పించాలని కోరుతున్నారని తెలిపారు. తిండికి, మందులకు డబ్బులు లేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, పింఛన్ల పంపిణీలో రాజకీయ రంగు పులుము కోవడం దారుణమని ఆరోపించారు.
రీసర్వే నిర్వహించండి
పూతలపట్టు నియోజకవర్గ స్థాయిలో పింఛన్ల అర్హతపై రీ సర్వే చేయాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. తాను నిరాహర దీక్ష చేసే సమయంలో ఐరాల మండల వ్యాప్తంగా రెండు వందలకు పైగా పింఛను దారులు అక్రమంగా తొలగించారంటూ వినతి పత్రాలను ఇచ్చారన్నారు. వాటిని అధికారులకు అందజేసినా ఇప్పటి వరకు స్పందన లేదని మండిపడ్డారు. రీసర్వే చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలవనున్నట్లు ఆయన తెలిపారు.
పేదల కడుపుకొట్టిన ఘనత చంద్రబాబుదే
Published Fri, May 1 2015 6:20 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement