సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు
డిపోలకే పరిమితమైన బస్సులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రగతిరథ చక్రాలు స్తంభించిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 43 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచే బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కార్మికులు బస్‌డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంజినీరింగ్, ఓపెన్ టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.
ఉద్యోగులు, చిన్నవ్యాపారులు ప్రైవేటు ట్యాక్సీల ప్రయాణాన్ని నమ్ముకున్నారు. ఎక్కువ చార్జీలు వసూలు చేయడంతో సగటు ప్రయాణికుడి జేబుకు చిల్లుపడింది. కొన్నిచోట్ల ప్రైవేటు వాహనాల రాకపోకలను సైతం ఆర్టీసీ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రైవేటు వ్యక్తులను ఏర్పా టు చేసి బస్సులు నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నప్పటికీ.. ఎక్క డా బస్సులు రోడ్డెక్కలేదు. సిబ్బంది వేతనాల పెంపుపట్ల ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో గురువారం కూడా సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది.
ఆగిన ‘చక్రం’.. ప్రయాణం నరకం
Published Wed, May 6 2015 11:30 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement