కర్నూలు: ఆర్టీసీ కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆర్టీసీ మాజ్దార్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మికుల సమస్యల కోసం 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో 126 స్థానాల నుంచి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందని రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.