ravindranath reddy
-
మీ యాక్షన్'కి 10 రెట్లు రియాక్షన్ ఉంటుంది.. రవీంద్రనాథెడ్డి వార్నింగ్
-
కూటమి ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు
-
బాబు మోసంపై కూటమి నేతలు నోరు మెదపరేం
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైంది. అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ మూడు రాజధానుల పేరుతో కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. రెండవ లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం భూమి, 100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు.ఇంతటి దుర్మార్గాలను చంద్రబాబే చేస్తాడుగతంలో హైదారాబాద్ ఒకే రాజధాని అని నష్టపోవాల్సి వచ్చింది. అలా జరగకూడదు అని జగన్ ఆలోచించారు. కొప్పార్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ తరలించారు. ఇంతటి దుర్మార్గాలను ఒక్క చంద్రబాబు మాత్రమే చేస్తాడురాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు నోరుమెదపాలి. వైఎస్సార్సీపీ తరపున సీమ అభివృద్ధి కోసం కలసి వచ్చే వారితో ఆందోళనలు చేస్తాం. టీడీపీని, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలి’ అని రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
బీటెక్ రవి, పోలీసులకు వైఎస్ అవినాష్ రెడ్డి వార్నింగ్
-
టీడీపీ నేతలకు రవీంద్రనాథ్ రెడ్డి సీరియస్ వార్నింగ్
-
అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.. ప్రేమోన్మాది ఘటనపై రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
-
చంద్రబాబు మళ్ళీ జైలుకే...? రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
పాలిచే ఆవును వదులుకొని దున్నపోతును తెచ్చుకున్నాం..
-
‘టీడీపీ ఆఫీస్‌లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. ఇది ప్రజల ప్రభుత్వం కాదంటూ వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి చేతులెత్తేశారని.. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వంద రోజుల్లో రూ.30 వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. చేసిన అప్పులు, ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ప్రజలు తప్పు చేశామని బాధ పడుతున్నారు.. పాలిచ్చే ఆవును వదిలి తన్నే గేదెను తెచ్చుకున్నామని ఆవేదన పడుతున్నారు. ఓ పక్క దోపిడీ, మరో పక్క వైఎస్సార్సీపీ వారిపై దాడులు. వరదలు నుంచి డైవర్ట్ చేయడానికి ప్రకాశం బ్యారేజ్ బోటు అంటూ ఆరోపించారు. తీరా చూస్తే అది టీడీపీ నేతకు చెందిన బోటు. ఆ తర్వాత కాదంబరి అనే మహిళ వ్యవహారం తెచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నిక రాజకీయ కుట్రలు చేసినా కానీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు మర్చిపోరు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ ప్రతిష్టను దెబ్బతెస్తున్నారు. ఇలాంటి నీచమైన పాలిటిక్స్ చేసే వారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నెయ్యి వచ్చింది. టెస్ట్ చేసింది అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చాకే టెండర్లు పిలిచారు. సరఫరా కూడా జరిగింది ఆ తర్వాతే. మార్చి 16 నుంచి మా ప్రమేయం లేదు. తిరుమల, తిరుపతిలో రెండు ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ అన్నీ పరీక్షలు జరుగుతాయి. వాస్తవానికి ఉన్నత పరీక్షల కోసం మైసూర్ సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపుతారు. కానీ దీన్ని గుజరాత్ ఎన్డీడీబీకి పంపారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు.ఇదీ చదవండి: పరిపాలనకు ‘తిరు’క్షవరం‘‘ముందు రోజు ఈ సంస్థ ప్రతినిధులు టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. ఎన్డీడీబీ ప్రస్తుత చైర్మన్ మనీషా, మాజీ ఛైర్మన్ వర్షా ఇద్దరూ శ్యామలరావును కలిశారు. ఆ తర్వాతే ఈ రిపోర్ట్ వచ్చింది. గూడుపుఠాణి చేసి జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఈవో, ముఖ్యమంత్రి వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండు నెలల తర్వాత ఈ నివేదిక విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి..?. ఒక కీలకమైన టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్‌లో విడుదల చేయడం ఏంటి?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘ఇవన్నీ చూస్తుంటే పెద్ద కుట్ర జరిగిందని స్పష్టమవుతుంది. హిందువులను వైఎస్ జగన్‌కు దూరం చేయాలని ఈ కుట్ర పన్నారు. లడ్డూనే కాదు.. ఏ ఆహార పదార్థాల్లోనైనా జంతువుల కొవ్వు కలిపితే రెండు రోజుల్లోనే దుర్వాసన వస్తుందని నిపుణులు చెప్తున్నారు. కేవలం వైఎస్సార్సీపీని దెబ్బతీయాలని ఎన్డీఏ భాగస్వాములు అంతా కలిసి చేసిన కుట్ర. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.‘‘వైఎస్ జగన్ దేవుని దర్శనానికి వెళ్తుంటే అడ్డుకుని, మేమెప్పుడు అడ్డుకున్నామంటూ బుకాయిస్తున్నాడు. వైఎస్సార్సీపీ వారికి నోటీసులు ఇచ్చి, పోలీసులతో అడ్డుకున్నారు. 30 యాక్ట్ పెట్టీ వైఎస్సార్సీపీ వారినే ఆడ్డుకుంటారా. ? ఇతర పార్టీల వారు తిరుమల చేరుకున్నా యాక్ట్ అమలు కాదా .?. నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకో.’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి సవాల్ విసిరారు.‘‘వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు.. సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు.. నీకు బుద్ధి చెప్తారు. నిన్న వైఎస్సార్సీపీ పిలుపు మేరకు ప్రజలు నిన్న దేవాలయాల్లో చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని పూజలు చేశారు. పవన్ కళ్యాణ్.. తన ఓనర్ స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చి డ్రామాలు వేస్తాడు. ప్రశ్నిస్తాను అన్నాడు.. పిల్లల మిస్సింగ్ అన్నావు. డిప్యూటీ సీఎంగా నువ్వు ఎంతమందిని కాపాడావు ?. వరదల్లో కనీసం బయటకు వచ్చావా .? ఓనర్ స్క్రిప్ట్ ఇవ్వగానే బయటకు వచ్చి హంగామా చేశాడు. తాను క్రిస్టియన్ అని చెప్పి మళ్లీ సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నాడు. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అంటూ రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ నేత అయితే చాలు.. టీడీపీ కక్ష సాధింపు చర్యలు.. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది
-
మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్: అధికారం చేతిలో ఉందని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు. ఇదే సమయంలో వందేళ్ల క్రితమే కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.అయితే, వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతున్నాయి. అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ భాగస్వామిగా ఉన్న లే అవుట్పైకి ఇరిగేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే పంపించారు. లే అవుట్ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు. ఈ అంశంపై హై కోర్టులో స్టే ఉన్నా ఇబ్బంది పెట్టేందుకు కుటిల ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో లే అవుట్ వద్దకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లు బుధవారం చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..‘కోర్టులో స్టే ఉన్నా రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి -
అమ్మకు వందనం అన్నారు.. వందకు మద్యం మాత్రం ఇస్తున్నాడు
-
చంద్రబాబుపై రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్
-
అమరావతి పరిస్థితిని బట్టి చంద్రబాబు పాలన ప్రజలకు అర్థమైంది
-
మితిమీరిన టీడీపీ ఆగడాలు.. రవీంద్రనాథ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు, పవన్ గ్రామ సభలపై రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్
-
‘పవన్ కల్యాణ్ గ్రామ సభలకు ప్రజల స్పందన శూన్యం’
వైఎస్సార్ కడప, సాక్షి: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి స్పందన శూన్యమని కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. పదవులు లేకపోయినా పచ్చ కండువాలు వేసుకుని గ్రామసభల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ. 13 వేల కోట్ల అప్పు చేశారు. ప్రతి మంగళవారం అప్పుల రోజుగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్లుతోంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదు. ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఎందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకున్నామా అని ప్రజలు బాధ పడుతున్నారు. .. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన గ్రామ సభకు కూడా ప్రజల నుండి స్పందన లేదు. సూపర్ సిక్స్ పథకాలను పక్కాగా అమలు చేయాలి. లేకుంటే ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటాలు చేసేందుకు సిద్ధం. చంద్రబాబు 2014లో మోసం చేశారు.. ఇప్పుడు కూడా ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు’’ అని అన్నారు. -
చంద్రబాబూ.. నీ సంపద సృష్టి ఎక్కడ?: రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అంతా మోసం, దగా అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఇదే సమయంలో సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు.. మామూలు ఆర్ అండ్ బీ రోడ్లకు కూడా టోల్ టాక్స్ వేయబోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.కాగా, రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురంలో స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 14వేల కోట్లు అప్పు చేసి పెన్షన్లు, ఉద్యోగస్థులకు జీతాలు మాత్రమే ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగస్థులకు పెన్షన్లు అందివ్వలేని ప్రభుత్వం ఇది. రెండున్నర నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు కాలేదు. నేను సంపద సృష్టిస్తా అని చెప్పిన చంద్రబాబు.. ఎక్కడ నీ సంపద సృష్టి. అనేక అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. ప్రజలందరూ పరిస్థితిని గమనించి ప్రభుత్వాన్ని నిలదీయాలి. చంద్రబాబు సీఎం అయ్యాక తన నైజాన్ని ప్రజలకు మరోసారి చూపించాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలావే పెడుతున్నాడు.. నేను బిర్యానీ పెడతానని ఓట్లు దండుకున్నాడు చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాలు అంతా మోసం, దగా. ప్రభుత్వం విజ్ఞతతో ఆలోచించి ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి.మద్యం ప్రియులకు కొత్త పాలసీ అంటూ కూటమి సర్కార్ మోసం చేస్తోంది. ఉచిత ఇసుక పాలసీ అంటూ ఎక్కువ ధరలకు అమ్ముతోంది. రైతన్నకు అన్నదాత సుఖీభవ అంటూ దగా చేసింది. స్కూల్ విద్యార్థులకు తల్లికి వందనం అంటూ పంగనామం పెట్టింది. ఇవాళ ప్రజలు చంద్రబాబును నమ్మి మోసపోయారు. సంపద సృష్టిస్తామన్న బాబు ప్రభుత్వంలో మామూలు ఆర్ అండ్ బీ రోడ్లకు కూడా టోల్ టాక్స్ రాబోతోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాడులు, హత్యలు ఎక్కువయ్యాయి. వైఎస్సార్సీపీ నాయకులపైనా, వారి మద్దతుదారులపైనా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.పవన్‌పై సెటైర్లు..ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా నోరు మెదపడం లేదు. వీటిపై చంద్రబాబు స్క్రిప్టు రాలేదేమో.. వస్తే యాక్టర్ యాక్షన్ చేస్తాడు అనుకుంటా. రాష్ట్రంలో జూదం, మట్కా, దొంగ సారాయి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇసుక, మట్టి అక్రమ రవాణా పేట్రేగిపోతోంది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వక్స్ బోర్డ్ చట్ట సవరణ సమంజసం కాదని పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. గతంలో కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుందంటేనే ఎన్డీయే కూటమికి వైఎస్సార్సీపీ సపోర్టు చేసేది. ముస్లింల మనోభావాలు దెబ్బ తినకుండా వ్యతిరేకించిన పార్టీ వైఎస్సార్సీపీ. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో అందరికీ గౌరవం ఇచ్చేటట్టుగా మెలగాలని హితవు పలికారు. -
వైఎస్ఆర్ సీపీ ఓటమిపై రవీంద్రారెడ్డి రియాక్షన్
-
రైతుల నీటి కష్టాలు తీర్చాం : రవీంధ్రనాథ్ రెడ్డి
-
దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు సీఎం జగన్
-
చంద్రబాబూ.. అలా చెప్పే ధైర్యంగా ఉందా?: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: కొన్ని వేల హామీలు ఇచ్చి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం అమలు చేశాను అని ధైర్యంగా బాబు చెప్పగలరా.. 14 సంవత్సరాల సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. చదుకునే రోజుల్లో ఆయన ఆస్తులు ఎంత, ఈనాడు ఆయన ఆస్తి ఎంతో ప్రజలకు తెలుసు.. బాబు హయాంలో అవినీతి రాష్ట్రంగా పేరు గాంచిందన్నారు. లోకేష్ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, మంగళగిరిలో ఓడిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినా ఫలితం శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో ఆఖరికి దేవాలయాల్లో స్వీపర్ పోస్టుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. బాబు హయాంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి శూన్యం కాగా.. సీఎం జగన్ పాలనలో రెవెన్యూ డివిజనల్, కుప్పం నగర అభివృద్ధి జరిగిందని తెలిపారు. తండ్రి కొడుకులు ఉండేది హైదరాబాద్‌లో పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్లు సీఎంపై ఆరోపణలు చేయడం తప్ప.. రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 51 శాతంతో అధికారంలోకి వచ్చిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కిందన్నారు. అధికార వికేంద్రీకరణ చేయడం వల్ల సీఎం జగన్ అభివృద్ధికి నాంది పలికారన్నారు. గాలిని ఆపింది, తుఫాన్ ఆపింది నేనె అని గాలి కబుర్లు చెప్పే వ్యక్తి జగన్ కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి అని అన్నారు. ఐదు సంవత్సరాలు పాలన చేసిన దివంగత వైఎస్సార్‌ను నేడు ప్రజలు దేవుడిలా పూజిస్తున్నారు... మరి 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న బాబును ఏ ఒక్కరైనా పూజిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చదవండి: చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ -
చెన్నైకి బీటెక్ రవి పరార్!.. కీలక నేత సాయంతో జంప్!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ధ్వంసం చేసి అనంతరం కనిపించకుండా పోయిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసుల కళ్లుగప్పి చెన్నై చేరుకున్నట్లు సమాచారం. మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్ బీటెక్ రవి మార్చి 30 ఆదివారం వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో ఈ దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుని తన పొలిటికల్ గాడ్‌ఫాదర్‌ను ఆశ్రయించి గట్టెక్కే మార్గం సూచించాలని కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆ గాడ్‌ఫాదర్ స్పెషల్ ఫ్లయిట్లో మంగళవారం చెన్నైకి చేర్చారు. అందుకే బీటెక్ రవి దౌర్జన్యం.. పులివెందుల నియోజకవర్గంలో దౌర్జన్యం చేయగలిగామని చెప్పుకునేందుకు బీటెక్ రవికి ఇప్పుడు రాజకీయ అవసరం ఎంతో ఉంది. అందుకు.. తిరగబడే స్వభావం తక్కువగా ఉన్న చక్రాయపేట ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వెంచర్‌ను ధ్వంసం చేయడానికి అసలు కారణం అదేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక గత ఆదివారం దౌర్జన్యానికి పాల్పడ్డ బీటెక్ రవిని పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన హైదరాబాద్‌లో తన పొలిటికల్ గాడ్‌ఫాదర్‌ను ఆశ్రయించారు. దీంతో, బీజేపీలో కొనసాగుతున్న పూర్వపు టీడీపీ నేత సీఎం రమేష్ తెరపైకి వచ్చారు. అనంతరం.. సీఎం రమేష్, ఎం.రవీందర్, పి.శ్రీనివాసరావు అనే వ్యక్తులు ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లు అనుమతులు పొంది చెన్నై చేరుకున్నారు. అయితే, పోలీసులు గుర్తించకుండా ఉండేందుకే బీటెక్ రవి తన పేరును ఎం.రవీందర్‌గా మార్చుకున్నట్లు సమాచారం. మరోవైపు.. చక్రాయపేట ఘటనలో 32మందిని గుర్తించి వారిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. అయితే, వీరందరినీ ముందుండి నడిపించిన బీటెక్ రవి ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం, మరో పేరుతో ఇతర ప్రాంతాలకు పారిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘నీతి, నిజాయితీ, దమ్మూ, ధైర్యం ఉంటే సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురా.. నీ నిజాయితీ నిరూపించుకో..’ అంటూ నిజమైన్ వెంచర్ యజమానులు ఆ పోస్టులో సవాల్ విసురుతున్నారు. ఇది కూడా చదవండి: దోషులు ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి తానేటి వనిత -
సుందర నగరంగా కడప
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కడప నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, నగర మేయర్ సురేష్‌బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం స్థానిక నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్ కె.సురేష్‌బాబు అధ్యక్షతన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆహ్వానితులుగా హాజరు కాగా, మున్సిపల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగర అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కడప నగరాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏమాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. పేదవ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చెత్త పన్ను (క్లాప్ కార్యక్రమం), ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తామని చెప్పారు. కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పరిశుభ్రత, పారిశుధ్యంతోపాటు నగర సుందరీకరణకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. ఇంటింటి చెత్త సేకరణపై ఆయా డివిజన్ల కార్పొరేటర్లకు ఎదురైన సమస్యలపై నిర్దిష్ట ప్రణాళికతో చర్యలు చేపట్టి సానుకూల వాతావరణాన్ని సమకూరుస్తామన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు కౌన్సిల్ సమావేశం అజెండాలో పొందుపరిచిన తొమ్మిది అంశాలతోపాటు ప్రధానంగా నగరంలోని అన్ని బీటీ, సీసీ రోడ్లు పూర్తి చేసి కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు, తాగునీటి వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన మెరుగు పరిచేందుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు నిత్యానందరెడ్డి, ముంతాజ్‌బేగం, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్ రవి
సాక్షి, కడప: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పార్టీలో రోడ్డెక్కిన రచ్చకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలే కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ క్యాడర్‌లోనూ వారి పెత్తనం చర్చనీయాంశంగా మారింది. దీంతో పలువురు నియోజకవర్గ ఇన్చార్జిలు ఏకమై సదరు నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లకు ఏకంగా ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి (వాసు), పులివెందులకు చెందిన బీటెక్ రవిలు పార్టీలో మితిమీరిన జోక్యంతో టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలను కాదని సదరు నేతలు వారి వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వాసు, బీటెక్‌ల ప్రోత్సాహంతో కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప, బద్వేలు నియోజకవర్గాల పరి«ధిలోని రెండవ శ్రేణి నేతలు ఇన్చార్జిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ఇన్చార్జిలను కాదని ఈసారి ఎన్నికల్లో మీకే టిక్కెట్లు అంటూ ఆ ఇద్దరు నేతలు ప్రచారం చేస్తుండడంతో ప్రస్తుతమున్న ఇన్చార్జిలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ►మైదుకూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ఈసారి కూడా తనకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేతను కలిసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాసు, బీటెక్ రవిలు పుట్టాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పుట్టా వర్గం ఆరోపిస్తోంది. ►ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దివంగత వీరారెడ్డి కుటుంబంతోనూ వాసు, బీటెక్ రవిలకు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న విజయమ్మ తనయుడు నితేష్కుమార్రెడ్డి వాసు వ్యవహార శైలిని తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. ►ఇక రాజంపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో చెంగల్రాయులు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలో వాసు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి అక్కడున్న కొందరు నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇక్కడ కూడా వాసు మితిమీరిన జోక్యంతోనే ఆ పరిస్థితి తలెత్తినట్లు సొంత పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ►కడప నియోజకవర్గంలోనూ వాసు జోక్యంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా వాసు పోటీలో ఉంటారని ఇప్పటికే టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే కడప అసెంబ్లీ స్థానం నుంచి మైనార్టీలను కాదని ఈసారి ఎన్నికల్లో తన సతీమణిని నిలబెట్టాలని వాసు ఉద్దేశంగా కనబడుతోంది. ఇప్పటికే కడప అసెంబ్లీ టిక్కెట్టును ఆశిస్తున్న ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, అమీర్‌బాబు తదితరులు వాసు తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ►పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వాసు, అటు బీటెక్ రవిలు అన్ని నియోజకవర్గాల్లో వేలుపెట్టి వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఇప్పటికే పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, మల్లెల లింగారెడ్డి, నితీష్‌కుమార్‌రెడ్డి తదితరులు చంద్రబాబు, లోకేష్‌లకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరి మితిమీరిన జోక్యంతోనే జిల్లాలో అరకొరగా ఉన్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ►ఉమ్మడి జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో మాజీమంత్రి పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్‌తోపాటు మండిపల్లి రాంప్రసాద్రెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. రాంప్రసాద్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును కలిశారు. అయితే వాసు స్వయాన సోద రుడైన రమేష్‌రెడ్డి సైతం టిక్కెట్ రేసులో ఉన్నారు. వాసు, బీటెక్‌లు రమేష్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ►ప్రొద్దుటూరులో వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన ఆయన టిక్కెట్ తనకేనంటూ బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ తనకేనంటూ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా ఈ దఫా ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్ వస్తుందని వరదరాజులరెడ్డి వర్గం సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే పొలిట్‌బ్యూరో సభ్యులు వాసు, బీటెక్ రవిలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ►కమలాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఓటమి చెందిన పుత్తా నరసింహారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ లభిస్తుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇప్పటికే వీరశివారెడ్డి చంద్రబాబును కలిశారు. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ అభ్యర్థి తమ నేతేనని వీరశివారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. దీని వెనుక వాసు, బీటెక్ రవి జోక్యం ఉన్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది.