కడప: శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరు 854 అడుగుల వరకు నిండినా రాయలసీమకు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీటి విడుదల చేసిన తర్వాతే కిందికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతు రుణాలను రీషెడ్యూల్ చేయడానికి ఆర్బీఐ, ఇతర బ్యాంక్లు కుదరదన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్ బాషా హెచ్చరించారు.
'సీమకు నీటిని విడుదల చేశాకే.. కిందకు వదలాలి'
Published Wed, Aug 6 2014 7:47 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement
Advertisement