వేసవిలో కరవు కాటకాలతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతోంటే గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కరెంటు బిల్లులు చెల్లించాలని వారిపై ఒత్తిడి తీసుకురావటం అన్యాయమన్నారు.
కమలాపురం: వేసవిలో కరవు కాటకాలతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతోంటే గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కరెంటు బిల్లులు చెల్లించాలని వారిపై ఒత్తిడి తీసుకురావటం అన్యాయమన్నారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బడుగుబలహీన వర్గాలకు కృషిచేస్తున్నట్లు ప్రచార ఆర్భాటాలతో అబద్ధాలతో మోసం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో వికేంద్రీకరించాలనే కానీ ఒకే చోట కేంద్రీకరిస్తే మళ్లీ ఉద్యమాలు వచ్చే ప్రమాదముందన్నారు.