
'టీడీపీ... ఆర్టీసీ కార్మిక ద్రోహి'
టీడీపీ.... ఆర్టీసీ కార్మిక ద్రోహి అని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అభివర్ణించారు.
విజయనగరం : టీడీపీ.... ఆర్టీసీ కార్మిక ద్రోహి అని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అభివర్ణించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఫైల్పై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతకం చేస్తానన్నారని తెలిపారు. ఫిబ్రవరిలో జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో శనివారం విజయనగరంలో రవీంద్రనాథ్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ... ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్... కార్మికుల ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ పరిరక్షణకు వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియనే ప్రత్యామ్నాయం అని రవీంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు.
టీడీపీ కార్యకర్తలు నిర్వహించే అక్రమ రవాణా వల్లే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ఈ సమీక్ష సమావేశానికి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి, పార్లమెంట్ ఇంఛార్జ్ బేబీనాయనతపోటు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరావు హాజరయ్యారు.