ఆ ఆలోచన విరమించుకోవాలి: రవీంద్రనాథ్రెడ్డి | Save APSRTC demands YSRCP MLA Ravindranath reddy | Sakshi
Sakshi News home page

ఆ ఆలోచన విరమించుకోవాలి: రవీంద్రనాథ్రెడ్డి

Published Tue, Mar 8 2016 11:41 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

ఆ ఆలోచన విరమించుకోవాలి: రవీంద్రనాథ్రెడ్డి - Sakshi

ఆ ఆలోచన విరమించుకోవాలి: రవీంద్రనాథ్రెడ్డి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ రోజురోజూకు నిర్వీర్యమైపోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ... గతంలో ఆర్టీసీ పరిపుష్టికి దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు.

ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధిక గంటలు పని చేయించుకుంటూ సిబ్బందిని వేధిస్తున్నారని విమర్శించారు. కండక్టర్ల వ్యవస్థను రద్దు చేస్తామని సంస్థ ఎండీ ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఎండీకి రవీంద్రనాథ్రెడ్డి సూచించారు. ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఇచ్చి ఆదుకుందని... అలాగే నిధులిచ్చి ఏపీఎస్ఆర్టీసీని ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వానికి రవీంద్రనాథ్రెడ్డి సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement