'రాష్ట్రంలో హిట్లర్ పాలన' | ysrcp MLA ravindranath reddy slams on tdp | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో హిట్లర్ పాలన'

Published Fri, Sep 18 2015 1:48 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ysrcp MLA ravindranath reddy slams on tdp

కడప: రాష్ట్రంలో హిట్లర్ మాదిరి నియంత పాలన కొనసాగుతోందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ నాయకుల జోక్యం శృతి మించిందని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీల చైర్మన్లతో సంబంధం లేకుండా పింఛన్లు, రుణాల మంజూరు వంటి పథకాల లబ్ధిదారులను టీడీపీ నేతలే ఎంపిక చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

చైర్మన్ సంతకం లేకుండా కేవలం సభ్యుల సంతకాలతోనే లబ్ధిదారుల జాబితాను నిర్ణయిస్తున్నారని తెలిపారు. ఇందుకు అధికారులు వంత పాడుతున్నారని అన్నారు. ఆ విధంగా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే అధికారులపై న్యాయస్థానాలను ఆశ్రయించి. వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement