సాక్షి ప్రతినిధి, కడప : గత నాలుగేళ్లుగా ఇంటికే పరిమితమైన టీడీపీ నేత వీరశివారెడ్డికి ఉన్నట్లుండి ప్రజల కష్టాలు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందని, నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేలకు ప్రజల సమస్యలు పట్టడం లేదని ఆయన చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజ మెత్తారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడు తూ.. వీరశివా గత చరిత్ర మరిచి మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యేగా పనిచేసిన రోజుల్లో ఒక్కరోజు కూడా ప్రజల గురించి పట్టించుకోని వ్యక్తికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే అర్హ త లేదని ధ్వజమెత్తారు. ‘మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొనుగోలు చేసిన సీఎం రాజ్యాంగానికి విరుద్ధంగా వారికి మంత్రి పదవులను కేటాయించారు.
దీనిపైనే మేము స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నేటికీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగానే స్పీకర్ గుర్తిస్తున్నారు. అలాగైతే వారు మంత్రులుగా ఎలా కొనసాగుతారు. అంటే రాష్ట్రంలో టీడీపీ–వైఎస్సార్‌సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే సందేహం వ్యక్తమవుతోంది. పైగా అసెంబ్లీలో మా వాణి వినిపించినా దాన్ని ప్రసారం చేయరు. కేవలం టీడీపీ నేతలు మాట్లాడిందే ప్రసార మవుతుంది. అందువల్లే ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వమని తేల్చిచెప్పాం. టీడీపీ–బీజేపీలు కలిసి మేని ఫెస్టోలో అనేక హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశాయి. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని రవీంద్రనాథ్‌రెడ్డి వివరించా రు. ఢిల్లీలో మహాధర్నా చేసి బీజేపీపై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. ఇవేవీ వీరశివారెడ్డికి ప్రజాసమస్యలుగా కనిపించకపోవడం హాస్యాస్పదమన్నారు. వీరశివా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment