veera siva reddy
-
టీడీపీ ఫర్ సేల్.. నిప్పులు చెరిగిన వీరశివారెడ్డి, శివబాలా
-
టీడీపీకి షాకిస్తూ వైఎస్సార్సీపీలోకి వీరశివారెడ్డి
వైఎస్ఆర్, సాక్షి: ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి షాకిస్తూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. గురువారం పులివెందులలో నామినేషన్ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు.ఏపీలో సంక్షేమ పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు. ఆ సంక్షేమ పథకాల్ని చూసి అకర్షితుడనై వైఎస్సార్సీపీలో చేరా. ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. వైఎస్సార్సీపీ నా సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా సరే. ఏ పని అప్పగించినా విధేయంగా పని చేస్తా. .. చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు. ఏపీలో మళ్లీ వైఎస్సార్సీపీనే అధికారంలోకి రావడమే ఖాయం. -
ఓటీటీలోకి బాలయ్య 'వీరసింహారెడ్డి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా వీరసింహారెడ్డి ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్ భారీగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో వీరిసింహారెడ్డి మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు. కాగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్,మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Seema Simham vetaa shuru🦁💥#VeeraSimhaReddyOnHotstar premieres @ 6 PM on February 23 only on #DisneyPlusHotstar It’s time for #VSRHungamaOnHotstar! Ready na? pic.twitter.com/hfMMJ6jROX — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 12, 2023 -
నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ
సాక్షి, సత్యసాయి జిల్లా: కదిరికి చెందిన ఏపీపీఎస్సీ సభ్యులు జీవీ సుధాకర్‌రెడ్డి కుమార్తె లక్ష్మి సైనా, వైఎస్సార్ జిల్లాకు చెందిన వీర ప్రతాప్‌రెడ్డి కుమారుడు వీర శివారెడ్డి వివాహ రిసెప్షన్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పలువురు ప్రముఖులు రిసెప్షన్‌కు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. చదవండి: (ఘనంగా ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్) -
వైఎస్సార్ సీపీలోకి వీరశివారెడ్డి
వైఎస్సార్ కడప: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో వైఎస్సార్సీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే.. కమలాపురం మండలం కోగటం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ ఏర్పాటుకు, నూతన భవన నిర్మాణాల కోసం భూమి పూజ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, డిసీసీబీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడు నెలలకే ఇచ్చిన హామీలలో 80 శాతం నేరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమేనని దక్కుతుందన్నారు. రాజధానిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అలా చేయకపోవడం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి వదలుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి త్వరలో సీఎం జగన్ సమక్షంలో వెఎస్సార్సీపీలో చేరునున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. గత కొద్ది కాలంగా వీర శివారెడ్డి టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో కమలాపురం టికెట్‌ను వీరశివారెడ్డి ఆశించినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచే వీరశివారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. చదవండి: బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం! -
వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్
సాక్షి, కడప : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీకి వైఎస్సార్ జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వీరశివారెడ్డి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా స్పందనను గమనించకుండా ఓటమిలో బౌండరీలు కొడుతున్న వారికే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని విమర్శించారు. టీడీపీకి రాజీనామా లేఖను ఇప్పటికే పంపానని చెప్పిన ఆయన...జిల్లా అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఉక్కు కర్మాగారం నిర్మింపజేస్తారని, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. తమ నియోజకవర్గానికి సంబంధించి గాలేరు–నగరి ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయని పేర్కొన్నారు. అభివృద్ధిని కాంక్షించి ఎలాంటి షరతులు లేకుండానే తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, సహకార సంఘ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన అనంతరం వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు వీరశివారెడ్డి ప్రకటన చేశారు. తన కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు తమ క్యాడర్ అంతా వైఎస్సార్సీపీలో చేరుతుందన్నారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు కొంతమంది ప్రచారం చేశారని, తనకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. -
టీడీపీలో చిచ్చు పెడుతున్నావ్
సాక్షి, కడప రూరల్ : మంత్రి ఆదినారాయణరెడ్డిపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి విరుచుకుపడ్డారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘నేను మొదటి నుంచి టీడీపీలో ఉన్నా. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఆదినారాయణరెడ్డి ఏడాది కిందట వచ్చారు. మంత్రి పదవి పొందారు. నా ముందు ఆయన చాలా జూనియర్. ఇటీవల ఆది రెండుసార్లు కమలాపురానికి వచ్చి నా ప్రస్తావన తీసుకురావడం ఏంటి? నాకు సీటు వస్తుందా? గెలుస్తారా? అని అడగడం.. మరొక నాయకుడి గురించి మాట్లాడుతూ మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయారు.. ఈసారి ఎలాగైనా ఆయనను గెలిపించాలని తన సహచరులతో చెప్పడం ఏంటి? అని నిలదీశారు. కమలాపురం, బద్వేలుతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో సీటు మీకిస్తాం.. వారికిస్తామని చెప్పి పార్టీలో గ్రూపులను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. సీఎం గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయిస్తారన్నారు. జమ్మలమడుగులో నియోజకవర్గ ఇన్చార్జి రామసుబ్బారెడ్డి ఒకసారి మినీ మహానాడు నిర్వహిస్తే అందుకు పోటీగా మంత్రి ఆదినారాయణరెడ్డి రెండవసారి మినీ మహానాడును నిర్వహించడం శోచనీయమన్నారు. కాగా మంత్రి ఆది వ్యవహార తీరుపై ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితోపాటు సీఎంకి ఫిర్యాదు చేశామన్నారు. ఆదిపై చర్యలు చేపట్టకపోతే జిల్లాలో ఆ ఒక్క సీటు కూడా మిగలదన్నారు. -
మంత్రి ఆది పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు
-
వీరశివా.. ఖబడ్దార్!
సాక్షి ప్రతినిధి, కడప : గత నాలుగేళ్లుగా ఇంటికే పరిమితమైన టీడీపీ నేత వీరశివారెడ్డికి ఉన్నట్లుండి ప్రజల కష్టాలు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందని, నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యేలకు ప్రజల సమస్యలు పట్టడం లేదని ఆయన చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజ మెత్తారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడు తూ.. వీరశివా గత చరిత్ర మరిచి మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యేగా పనిచేసిన రోజుల్లో ఒక్కరోజు కూడా ప్రజల గురించి పట్టించుకోని వ్యక్తికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే అర్హ త లేదని ధ్వజమెత్తారు. ‘మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొనుగోలు చేసిన సీఎం రాజ్యాంగానికి విరుద్ధంగా వారికి మంత్రి పదవులను కేటాయించారు. దీనిపైనే మేము స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను నేటికీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగానే స్పీకర్ గుర్తిస్తున్నారు. అలాగైతే వారు మంత్రులుగా ఎలా కొనసాగుతారు. అంటే రాష్ట్రంలో టీడీపీ–వైఎస్సార్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే సందేహం వ్యక్తమవుతోంది. పైగా అసెంబ్లీలో మా వాణి వినిపించినా దాన్ని ప్రసారం చేయరు. కేవలం టీడీపీ నేతలు మాట్లాడిందే ప్రసార మవుతుంది. అందువల్లే ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వమని తేల్చిచెప్పాం. టీడీపీ–బీజేపీలు కలిసి మేని ఫెస్టోలో అనేక హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశాయి. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని రవీంద్రనాథ్‌రెడ్డి వివరించా రు. ఢిల్లీలో మహాధర్నా చేసి బీజేపీపై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. ఇవేవీ వీరశివారెడ్డికి ప్రజాసమస్యలుగా కనిపించకపోవడం హాస్యాస్పదమన్నారు. వీరశివా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీలోకి వీరాశివారెడ్డి సోదరుడి కుమారులు
-
సభకు అభ్యంతరమెందుకు?: వీరశివారెడ్డి
తెలంగాణవాదుల ప్రవర్తన చూస్తుంటే మునుముందు పరస్థితులపై భయాందోళనలు కలుగుతున్నాయని వైఎస్ఆర్ జిల్లా కమాలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో జరపతలపెట్టిన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. సభ సజావుగా జరగనీయకుండా చేసేందుకు బంద్ పాటించడాన్ని ఖండించారు. తెంగాణ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం సూత్రపాయంగా అంగీకరించిందని, ఇలాంటప్పుడు సభ జరిగితే వారికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాయితే రాష్ట్ర విభజన జరిగాక పరిస్థితి ఇంక ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే సాగు, తాగు నీరు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై విభజన ప్రక్రియకు ముందే చర్చ జరగాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రకటించడం ద్వారా కడుపు నిండి ఉన్న ఈ ప్రాంతం వారు సంయమనం పాటించాల్సి ఉంటుందని హితువు పలికారు. టీఎన్జ్వోలు భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవద్దని సూచించారు. -
రాజీనామా డ్రామాలొద్దు: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
-
సమైక్యాంధ్రకు మద్దతుగా వీరశివా రాజీనామా