సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రాష్ట్రం సమైక్యంగా, సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. తెలుగు జాతి నిండు వెలుగుజాతిగా ఉండాలని, తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని వీరశివారెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీని కూడా నమ్మవద్దని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పదిసీట్లు వస్తాయని రాష్ట్రాన్ని విభజించటం సరికాదన్నారు. అలా అయితే సీమాంధ్రలో ఒక్క సీటు కూడా రాదని వీరశివారెడ్డి అన్నారు