NBK Veera Simha Reddy Locks Its OTT Release Date - Sakshi
Sakshi News home page

Veera Simha Reddy : ఓటీటీలోకి బాలయ్య 'వీరసింహారెడ్డి'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Published Sun, Feb 12 2023 11:44 AM | Last Updated on Sun, Feb 12 2023 3:46 PM

Veera Simha Reddy Locks Its OTT Release Date - Sakshi

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

తాజాగా వీరసింహారెడ్డి ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌ భారీగా ఈ చిత్రం డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దీంతో థియేటర్లలో వీరిసింహారెడ్డి మిస్‌ అయినవాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు. కాగా ఈ చిత్రంలో  వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్‌,మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement