Nandamuri Balakrishna's Veera Simha Reddy OTT Release Date, Platform - Sakshi
Sakshi News home page

Veera Simha Reddy OTT Streaming Date: అప్పుడే ఓటీటీకి వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్‌ ఎక్కడ, ఎప్పుడంటే..!

Published Wed, Feb 1 2023 10:16 AM | Last Updated on Wed, Feb 1 2023 10:49 AM

Here Is The Balakrishna Veera Simha Reddy Movie OTT Release Date - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. బాలయ్యకు జోడీగా శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే థియేటర్లో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వీర సింహారెడ్డి ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

చదవండి: సీనియర్‌ నటి ఖుష్బుకు చేదు అనుభవం

ఈ తాజా బజ్‌ ప్రకారం త్వరలోనే ఈమూవీ ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ మేకర్స్‌తో భారీ ధరకు డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీర సింహారెడ్డి ఓటీటీ హక్కుల కోసం హాట్ స్టార్ భారీగానే డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు హాట్‌స్టార్‌ ప్లాన్‌ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. 

చదవండి: వేణుకి రూ. 20 కోట్ల పైగా ఆస్తులు.. కానీ నేను అద్దే ఇంట్లో ఉంటున్నా: వేణు మాధవ్‌ తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement