
ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన చిత్రం ఐరావతం. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఊహించని రీతిలో ఆదరణ దక్కించుకుంది. రీసెంట్‌గా వచ్చి సైలెంట్ హిట్‌గా నిలిచింది. నవంబర్ 17 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. నూజివీడు టాకీస్‌పై రేఖ పలగని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేవలం ఒక్క నెలలోనే 100 మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్ మినిట్స్ సాధించింది.
అసలు కథేంటంటే..: శ్లోక అనే బ్యూటీషియన్ బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్‌గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్ డే వీడియోలు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాలే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది. హీరో పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి మరో ప్రేమికుడితో వెళ్లిపోతుంది. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా. ఓటీటీలో చూసి ఈ సినిమా ఎంజాయ్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment