Buzz: Balakrishna Veera Simha Reddy Locks This OTT Partner - Sakshi
Sakshi News home page

Veera Simha Reddy Locks OTT Partner: వీర సింహారెడ్డి ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..!

Published Thu, Jan 12 2023 4:40 PM | Last Updated on Thu, Jan 12 2023 5:12 PM

Buzz: Balakrishna Veera Simha Reddy Locks This OTT Partner - Sakshi

నందమూరి బాలకృష్ణ-శృతి హాసన్‌ జంటగా నటించి లేటెస్ట్‌ మూవీ వీరసింహారెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు గురువారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: రాహుల్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్‌ రూమర్స్‌

ఇదిలా ఉంటే ఇక థియేటర్లో రిలీజ్‌ అయిన చిత్రాలు ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరసింహరెడ్డి డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డిస్నిప్లస్‌ హాట్‌స్టార్‌ ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అధికారిక​ ప్రకటన కూడా రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడనేది కూడా హాట్‌స్టార్‌ ప్రకటించాల్సి ఉంది. 

చదవండి: పుట్టబోయే బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయిన ఉపాసన, ట్వీట్‌ వైరల్‌

ఇక హిట్‌ సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీకి వస్తుండగా.. మరికొన్ని చిత్రాలు నాలుగు వారాలకే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. మరి వీరసింహారెడ్డి మాత్రం 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీకి రానుందని తెలుస్తోంది. కాగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. కన్నడ స్టార్‌ నటుడు దునియా విజయ్‌ విలన్‌ కాగా ఆయనకు భార్యగా నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నటించింది. ప్రముఖ హనీరోజ్‌లు ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement