
సాక్షి, కడప: నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడే మేల్కొన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్‌బాబు, అమర్‌నాథ్ రెడ్డిలు విమర్శించారు. ఏదో సాధించినట్టు టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు.
రాష్ట్రం అధోగతిపాలు కావడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఎవరికీ రానన్ని నిధులు మనకే వచ్చాయని గతంలో చెప్పారని.. ఇప్పుడేమో మాట మార్చి న్యాయం చేయాలనడం విడ్డూరంగా ఉందని తెలిపారు.