వైఎస్సార్ జిల్లా : నాలుగు రోజులుగా సర్వరాయసాగర్ నీటి కోసం 64 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం తన పాదయాత్రను ముగించారు. ఈ నెల 25న నీటిని విడుదల చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ముందుగా ప్రకటించిన దీక్షను వాయిదా వేశారు. ఒకవేళ 25న నీరు ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. కడప కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా తదీతరులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment