వైఎస్సార్ జిల్లా: ఏపీలో రైతులు కష్టాలు పడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి. విద్యుత్ చార్జీలు పెంచను అని హామీ ఇచ్చి పెంచుతుంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించవచ్చుగా..?, ప్రశ్నించే గొంతు మూగబోయిందా..? మీరు అధికారంలో ఉన్నా జగన్‌ను మాత్రమే ప్రశ్నిస్తావా’ అంటూ ధ్వజమెత్తారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించడానికి పవన్ ఆగమేఘాలపై వచ్చారు. ఎవర్ని పరామర్శించినా ఆహ్వానించదగినదే. అయితే జరిగిన సంఘటన ఎంత తీవ్రమైంది అనేది కూడా చూడాలి. ఎంపీపీ కుమారుడు మండల ఆఫీసు సిబ్బంది పిలిస్తే వెళ్లారు. అక్కడ ఎంపీపీ(MPP) ఛాంబర్ కు తాళాలు వేశారు..ఓపెన్ చేయండి అని అడిగారు. ముందుగా పథకం ప్రకారం ఎంపీడీవోపై దాడి అంటూ వందల మంది టిడిపి వారు వచ్చేసారు. టీడీపీ వారు రావడంతో అక్కడే తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎంపీడీవోపై కుర్చీ పడి దెబ్బ తగిలింది.
దాన్ని డిప్యూటీ సీఎం పవన్ డైవర్ట్ చేసే కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ చార్జీలపై మేం చేసే పోరుబాటను డైవర్ట్ చెయ్యడానికి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. చంద్రబాబు తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్‌ను పంపుతున్నారు. గాలివీడు సంఘటనను కూడా అలాగే ఉపయోగించుకున్నారు. ముందుగానే ఎవరిపై కేసు పెట్టాలో కూడా నిర్ణయించుకున్నారు. ఎంపీడీవోకి ఏమీ కాకపోయినా ఆయన్ను రిమ్స్‌కి తెచ్చి హడావుడి చేశారు.
సింహాద్రిపురం మండలం దుద్దెకుంటలో ఒక రైతు కుటుంబం చనిపోయింది. రైతులకు మద్దతు ధర లేకపోవడం వల్ల, పంట నష్టం ఇవ్వని కారణంగా ఆ రైతు కుటుంబం ఆత్మహత్యకు ఒడిగట్టారు అదే జగన్(YS Jagan) ఉంటే ఆ రైతు కుటుంబం చనిపోయేది కాదు. ప్రశ్నిస్తాను అనే పవన్ కళ్యాణ్ రైతు కష్టాలపై ఎందుకు ప్రశ్నించరు...?, ఇంత దూరం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ రైతు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..?, చంద్రబాబు అడే డ్రామాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు వద్దకు ఎందుకు వెళ్ళడం లేదు...?, ఉక్కు ఉద్యోగుల తరఫున పవన్(Pawan Kalyan) ప్రశ్నించవచ్చుగా..?, పిఠాపురంలో జాన్ అనే జనసేన నాయకుడు ఓ మైనర్ బాలికను రేప్ చేస్తే ఎందుకు పరామర్షించలేదు..?, మీ ఎమ్మెల్యే నానాజీ ఒక సీనియర్ ప్రొఫెసర్ పై దాడి చేస్తే నువ్వు ఎందుకు కట్టడి చేయలేదు..?, కానీ డైవర్ట్ చెయ్యడానికి గాలివీడు వచ్చి చంద్రబాబు చెప్పినట్లు నటిస్తున్నాడు. మీ నాటకాలన్నీ ప్రజలు చూస్తున్నారు..ప్రజలే బుద్ధి చెప్తారు’ అని మండిపడ్డారు రవీంద్రనాథ్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment