
పట్టిసీమ బూచి చూపించి అక్రమ ప్రాజెక్టులు
చంద్రబాబుకు ఓటుకు కోట్ల కేసు భయం పట్టుకుందని.. అందుకే ఆయన తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం లేదని వైస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.
చంద్రబాబుకు ఓటుకు కోట్ల కేసు భయం పట్టుకుందని.. అందుకే ఆయన తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం లేదని వైస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, వాటిని ప్రశ్నించని ఏపీ సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేస్తున్న 'జలదీక్ష' రెండోరోజున జగన్‌కు మద్దతుగా వచ్చిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడారు.
రాయలసీమ పేరుతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కట్టి.. రూ. 600 కోట్ల సొమ్మును బాబు దోచుకున్నారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు బూచి చూపించే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతోందని అన్నారు. చంద్రబాబుకు కావల్సింది ప్రజల బాగోగులు కాదని.. పదవి మాత్రమేనని రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. సీఎం పదవి కోసం సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ఓటుకు కోట్ల కేసు నుంచి బయట పడేందుకు ఏపీని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని విమర్శించారు.