
'అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ'
అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఎలాంటి చర్చ లేకుండా ఏపీ రాజధాని ప్రకటించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కోటరీకి లాభం కలిగించేందుకే విజయవాడ దగ్గర రాజధాని ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని రాష్ట్రంపై రుద్దిందని మరో ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు.