‘ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్‌ ఒక్కరే’ | Kamalapuram MLA Ravindranath Reddy Comments Over RTC Employees | Sakshi
Sakshi News home page

‘ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్‌ ఒక్కరే’

Published Tue, Dec 31 2019 3:04 PM | Last Updated on Tue, Dec 31 2019 3:27 PM

Kamalapuram MLA Ravindranath Reddy Comments Over RTC Employees - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : రేపటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉందని కమలాపురం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రంలో కార్మికుల సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడని ప్రశంసించారు. మాట ఇస్తే మడమ తిప్పని మనిషిగా, నాయకుడిగా వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలుస్తారని అన్నారు. ఆర్టీసీకి ప్రాణం పోసిన మహానేత వైఎస్సార్‌ ఒక్కరేనని కొనియాడారు. ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. గత అయిదేళ్లలో అవినీతికి పరాకాష్టగా చంద్రబాబు పాలన సాగిందని విమర్శించారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం కూడా లేకుండా ప్రజా పాలన సాగుతుందన్నారు. టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు. అర్షులైన ప్రతి లబ్ధిదారులకు నవరత్నాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement