కడప: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు వైఎస్ఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. శుక్రవారం కడప బస్ డిపో ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులకు వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు తమ సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన వారిలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబులతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వలే తమకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది.