
వీఎన్ పల్లె, అప్పరాజుపల్లి, కమ్మవారిపల్లెలో పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి
సాక్షి, వీరపునాయునిపల్లె: శుక్రవారం మిట్టపల్లె గ్రామానికి చెందిన 20కుటుంబాలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. చంద్రమహేశ్వర్‌రెడ్డి, హరికేశవరెడ్డి, చెన్నకేశవరెడ్డి, శరత్‌కుమార్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, సుధాకర్, హరీష్, వెంకటరమణలతో పాటు మరిన్ని కుటుంబాలు పార్టీలో చేరాయి. వీరందరికీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కండువాలు వేసి చేర్చుకొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, ప్రతాప్, వేమనారాయణరెడ్డి, ప్రవీణకుమార్‌రెడ్డి, గురుపవన్, సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు : చెన్నూరు మైనార్టీ కాలనీలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో మైనార్టీ వర్గానికి చెందిన 30 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ సీపీలోచేరాయి. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎం.రంతు, నాయబ్‌రసూల్, ఖాదర్, భాష, నజీర్ అహ్మద్, షేక్ సయ్యద్, ఇబ్రహీం, చాంద్‌బాష, కలీం, అల్లాబకష్, మస్తాన్, మాబాష, అక్మల్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అన్వర్, మునీర్, కరీం, వారిస్, రబ్బు, పొట్టిపాటి ప్రతాప్‌రెడ్డి, గణేష్‌రెడ్డి, శివరామిరెడ్డి, సుబ్బారెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, కేశవరెడ్డి, మాధవరెడ్డి, రెడ్డెయ్యరెడ్డి పాల్గొన్నారు.
చింతకొమ్మదిన్నె : మండలంలోని కమ్మవారిపల్లి్ల గ్రామంలో శుక్రవారం మాజీ సర్పంచ్ బందలకుంట గంగిరెడ్డితో పాటు వారి అనుచరులు టీడీపీ నుండి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన 50 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పును కోరుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో చంద్రశేఖర్ రెడ్డి, నడిపి గంగిరెడ్డి,చిన్న గంగిరెడ్డి, పెద్ద గంగిరెడ్డి, శివగంగిరెడ్డి, లక్ష్మిరెడ్డి, సుబ్బారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, శివానందరెడ్డి తదితరులు పార్టీలో చేరారు
అప్పరాజుపల్లిలో ....
మండలంలోని అప్పరాజుపల్లి గ్రామంలో శుక్రవారం 15 కుటుంబాలు టీడీపీ నుండి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. కడప పార్లమెంటరీ అధ్యక్షుడు అనగాని కళాయదవ్ ఆధ్వర్యంలో మల్లెం విధశ్వనాధ్, బాలగంగాధర్, వెంకట సురేష్, జయదేవ్, వెంకట స్వామి, శ్రీనివాసులు, సురేంద్ర, ఓబులేసు, చంద్రయ్య, క్రిష్ణయ్య, సుబ్బరాయుడు తదితరులు పార్టీలో చేరారు.
వల్లూరు:
మండలంలోని కోట్లూరుకు చెందిన చెన్నారెడ్డి టీడీపీ నుండి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. మండలంలోని పాపాగ్నినగర్‌లో శుక్రవారం జరుగుతున్న ఇంటింటి ప్రచారంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment