వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.
కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైంది.
అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ మూడు రాజధానుల పేరుతో కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. రెండవ లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం భూమి, 100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు.
ఇంతటి దుర్మార్గాలను చంద్రబాబే చేస్తాడు
గతంలో హైదారాబాద్ ఒకే రాజధాని అని నష్టపోవాల్సి వచ్చింది. అలా జరగకూడదు అని జగన్ ఆలోచించారు. కొప్పార్తి ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ తరలించారు. ఇంతటి దుర్మార్గాలను ఒక్క చంద్రబాబు మాత్రమే చేస్తాడు
రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు నోరుమెదపాలి. వైఎస్సార్సీపీ తరపున సీమ అభివృద్ధి కోసం కలసి వచ్చే వారితో ఆందోళనలు చేస్తాం. టీడీపీని, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలి’ అని రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment