rayala seema
-
బాబు మోసంపై కూటమి నేతలు నోరు మెదపరేం
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు పాలనలో రాయలసీమకు అంతులేని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం నిర్ణయంపై రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలన్నారు.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైంది. అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ మూడు రాజధానుల పేరుతో కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. రెండవ లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం భూమి, 100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు.ఇంతటి దుర్మార్గాలను చంద్రబాబే చేస్తాడుగతంలో హైదారాబాద్ ఒకే రాజధాని అని నష్టపోవాల్సి వచ్చింది. అలా జరగకూడదు అని జగన్ ఆలోచించారు. కొప్పార్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ తరలించారు. ఇంతటి దుర్మార్గాలను ఒక్క చంద్రబాబు మాత్రమే చేస్తాడురాయలసీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు నోరుమెదపాలి. వైఎస్సార్సీపీ తరపున సీమ అభివృద్ధి కోసం కలసి వచ్చే వారితో ఆందోళనలు చేస్తాం. టీడీపీని, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలి’ అని రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు
సాక్షి, గుంటూరు: నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతు పవనాలు ఈ రోజు(ఆదివారం) ప్రవేశించాయని.. ఏపీ అంతటా రుతు పవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందినేడు రాయలసీమలోకి ప్రవేశించగా, ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. -
అనగనగా ఓ కథ.. రాయలసీమ కథా కార్యశాల
రాయలసీమ కథా కార్యశాల.. అనగానే.. ఏంది కథ? అనుకున్నా.. ఏమిరా వీరశంకర్రెడ్డీ.. దీనివల్ల సమాజానికి లాభం? పొరపాటుగా అలవాటైన సినీ ‘సీమ’యాసలో నన్ను నేను ప్రశ్నించుకున్నా.. నిర్వాహకులకు మోయలేని భారమేమో.. మనుషులు రాకపోతే అవమానమేమో.. నమ్మకంతో కూడిన సందేహం వ్యక్తం చేసుకున్నా.. కడపలో కథా కార్యశాల ముగిసి రెండు వారాలవుతున్నా వదలని ఆ జ్ఞాపకాలు..అనుభూతులు.. అనుభవాలు పై సందేహాలను పటాపంచలు చేశాయి. చంచలమైన మనసుకు జవాబుదారీతనాన్ని నేర్పాయి. సమాజం నుంచే కథ పుడుతుందని.. కథ వల్ల సమాజం అర్థమవుతుందని.. ఇదే సమాజానికి ప్రయోజనకరమని అవగతమైంది. మంచి కథకు మనుషుల కరువేం లేదని.. వచ్చినోళ్లందరూ గొప్ప రచయితలుగా రూపొందకపోయినా సరికొత్త ‘మనుషులు’గా మారతారని .. మనసులను చూసే దృక్పథం ఒకటి అలవాటవుతుందని.. ‘మనో భార’మితి కనిపెట్టినంత సంతోషం వేసింది. హాజరు కోసం నేను గడిపింది కాసేపే అయినా.. కార్యశాల విజయగాథను వినిపించడానికి చాలా కసరత్తే చేయాల్సి వచ్చింది. కథ రాయడం ఓ కళ అని వర్ణించినా.. దానిని శాస్త్రీయంగా చెప్పి, ఇలా చెప్పడం పేద్ద కళ అని నేర్పకనే నేర్పించారు. రెండు రోజుల ప్రయాణంలో కొత్తదారిని కనుక్కునేలా చేశారు. – షేక్ ముజుబుద్దీన్, సాక్షి, కడప డెస్క్ కడపలోని విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణం.. ఈ నెల 17, 18 తేదీల్లో రాయలసీమ కథాకార్యశాలకు విచ్చేసిన అతిరథ మహారచయితలు, భావి కథకులతో కళకళలాడింది. సీమకు చెందిన మూడు తరాల రచయితలతో పాటు కథారచనలో మెళకువలు నేర్చుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 42 మంది వర్తమాన కథకులకు వేదికైంది. లబ్దప్రతిష్టులు జీవితకథలు చెప్పేందుకు ఈ కార్యశాల పాఠశాలలా మారింది. ప్రసిద్ధ కథకులు డా.కేతు విశ్వనాథ్ రెడ్డి, షేక్ హుస్సేన్ సత్యాగ్ని, బండి నారాయణ స్వామి, శాంతి నారాయణల చేతుల మీదుగా కార్యశాల ప్రారంభమైంది. ప్రసిద్ధ కథకులు, విమర్శకులు.. శాంతి నారాయణ, దాదాహయాత్, డా.మేడిపల్లి రవికుమార్, పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, జి.ఉమామహేశ్వర్, డా.వి.ఆర్.రాసాని, శ్రీనివాసమూర్తి, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.ఎన్.ఈశ్వర్ రెడ్డి, యువ పరిశోధకులు డా.తవ్వా వెంకటయ్య తదితరుల అనుభవాలకు సజీవశిల్పంలా నిలిచింది. చివర్లో ప్రసిద్ధ రచయిత డా.బండి నారాయణ స్వామితో కథారచన మెళకువలపై ముఖాముఖి నడిచింది. మొత్తానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి కథాకార్యశాల సాహితీలోకంలో సరికొత్త పరిమళాలు వెదజల్లింది. యువ కథకుల భవిష్యత్తుకు భరోసానిచ్చింది. పేరుకు రాయలసీమ అని పెట్టినా.. గుంటూరు, ప్రకాశం, వైజాగ్, హైదారాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు హాజరు కావడం కార్యశాల ప్రాధాన్యత తెలిపింది. రాయలసీమ కథా కార్యశాలే కాదు.. ఇపుడు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కూడా విశేషంగా విజయవంతం కావడం.. తెలుగు సాహిత్యం ఎన్నటికీ సుసంపన్నమేనని స్పష్టతనిస్తోంది. 2022 వెళుతూ వెళుతూ సాహితీపంట పడించింది. 2023 తెలుగింట కథల పండుగ తెస్తుందని చెప్పింది. ఉపసంహారం ఇలాంటి కథా కార్యశాలలు మరిన్ని జరగాలి. ప్రతి చోటా నిర్వహించాలి. తద్వారా ప్రతి వ్యక్తి ఒక సంస్కారి కావాలి. ఇంటింటా సాహిత్యం విరబూయాలి. పుస్తక పఠనం మరింత పెరగాలి. ఈ డిజిటల్ యుగంలో ప్రతి మనసు ఒక పుస్తకమై పరిమళించాలి. ఆపాదమస్తకం అనుభూతించాలి. కొత్తకథకు జీవితమవ్వాలి. కథకు(డికి) ఉండాల్సిన లక్షణాలు కథ జీవితం నుంచి, హృదయం నుంచి రావాలి. జీవితాంతం పాఠకుడి మనసులో నిలిచిపోవాలి. జీవితం పట్ల అవగాహన, విస్తృత పరిశీలన ఉండాలి. విమర్శనాత్మకంగా చూడాలి. కథ ఓ కళ. శ్రద్ధతో నిరంతరం సాహిత్య, జీవిత అధ్యయనం చేస్తే.. దానిని పదికాలాలు కళకళలాడేలా రాయవచ్చు. కథ ముందుగా మనసులో, మెదడులో, హృదయంలో, ఆలోచనల్లో నలగాలి. సమాజమే కథా కార్యశాల. సమాజంలోని చలనాలను, మార్పుని చూడగలగాలి. కథలకు సామాజిక ప్రయోజనం ఉండాలి. ప్రశ్నతోనే జీవితం బాగుపడుతుంది. ప్రశ్నలు వేయండి. వేసుకోండి. ఎంత ఎక్కువ చదివితే అంత చక్కగా రాయగలరు. అన్నీ మన జీవితకాలంలో అనుభవించలేం, చూడలేం.. కాబట్టి చదవాలి. చదవడం ద్వారా జీవితం, అనుభవాలు అక్షరీకరించగలగాలి. కథ ఉద్దేశ్యం వ్యక్తి సంస్కరణ. తద్వారా సమాజ సంస్కరణ. కథ సమస్య నుంచి సంస్కరణ దిశగా ఉండాలి. అయితే సందేశాలు ఇవ్వకూడదు, ఉండకూడదు. మార్పు వస్తుంది. నిదానం కావచ్చు. కానీ తప్పకుండా వస్తుంది. వ్యక్తులు మారితే కానీ సమాజం మారదు. బాహ్య పరిస్థితులు మనిషిని ప్రభావితం చేస్తాయి. పాత కథే అయినా కథాంశం కొత్తగా ఉండాలి. దానిని ఎలా చెప్పాలనే విషయంలో మనదైన దృష్టికోణం కనిపించాలి. కథాంశం దగ్గరే కథ సగం విజయం సాధిస్తుంది. కథకు ఆది..మధ్య..తుది ఉండాలి. ప్రారంభం ఆసక్తిగా.. ముగింపు ఆలోచింపజేసేదిగా ఉండాలి. కథావస్తువుల ఎంపికలో పునరుక్తి లేకుండా చూసుకోవాలి. కథల్లో భాష సూటిగా, స్పష్టంగా, అత్యంత సహజంగా ఉండాలి. కథా శిల్పంలో సర్వం ఇమిడి ఉంటుంది.. శిల్పం వేరు భాష వేరు కాదు. కథ ఎలా చెప్పాలో, ఎవరి కోణంలో చెప్పాలో రచయిత సాధన చేయాలి కనిపించని వ్యవస్థ కూడా కథలో పాత్రేనని గుర్తుంచుకోవాలి. మనిషి మోసం... ప్రాంతానికి, సందర్భానికి అన్వయించుకుంటే ఆశ్చర్యపోయే అంశాలు కథలుగా మారతాయి. ప్రాంతీయత, మాండలికం పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేస్తాయి. పాత్రలు, జీవితం, సమాజం, ప్రకృతిలో సంఘర్షణ తప్పదు పాత్రలకు తమవైన నేపథ్యాలు, వైరుధ్యాలుంటాయి. ఉండాలి. సంఘర్షణ అనివార్యం. సంఘర్షణ ద్వారా పాత్రల మధ్య గొప్ప డ్రామా పుడుతుంది. కథల్లో పాత్రలు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. వాస్తవికతకు దగ్గరగా ప్రవర్తించాలి. వర్తమానానికి పునాది చరిత్ర. కథ చీకటి నుంచి వెలుగు వైపు నడిపించాలి . సమాజం పట్ల నిబద్ధత, బాధ్యత ఉండాలి. కవిలో భావావేశం అవసరం. రచయితలో అనవసరం. రచయితకు శాస్త్రీయ దృక్పథం ఉండాలి. వర్తమాన రచయితలు విమర్శను తట్టుకోవాలి. -
రాయలసీమలో పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదు : విద్యార్ధి జేఏసీ
-
కర్నూలులో న్యాయరాజధానిను కోరుతూ భారీ ర్యాలీ
-
రాయలసీమలో నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం: తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా తేమగాలులు రాయలసీమ వైపుగా పయనిస్తున్నాయి. దీంతో పాటు తీరం వెంబడి తూర్పు–పశ్చిమ గాలుల కలయిక (షియర్ జోన్) కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాయలసీమలో మంగళ, బుధవారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. చదవండి: ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లకు 27 వరకు గడువు -
చంద్రబాబు చేయని పనిని వైఎస్ జగన్ చేపట్టారు..
-
‘టీడీపీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారింది’
తాడేపల్లి: చంద్రబాబు నాయుడుడి ఎప్పుడూ రెండుకళ్ల సిద్ధాంతమేనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు లేఖ రాయించారని, రాయలసీమ లిఫ్టును ఆపేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారిందని, చంద్రబాబు హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్‌లను కట్టిందని అనిల్ కుమార్ గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు నోరెత్తడం లేదని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా చంద్రబాబు కేసులు వేశారని అన్నారు. -
రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతులు అవసరం లేదు
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2006 పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనలు వర్తించవు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదు. అదనపు ఆయకట్టు ఏర్పాటు కావడం లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అంతకన్నా కాదు. జలాశయం, విద్యుదుత్పత్తి ప్రాజెక్టును విస్తరించడం లేదా ఆధునీకరించడం చేయడం లేదు. గ్రావిటీ నుంచి పంపింగ్‌కు మారడాన్ని పర్యావరణ అనుమతుల మార్పుగా పరిగణించడం సాధ్యం కాదు. తనకు కేటాయించిన నీటినే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్నంత వరకు పర్యావరణ అనుమతుల ప్రసక్తే తలెత్తదు –ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర పర్యావరణ శాఖ సాక్షి, అమరావతి: పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) నోటిఫికేషన్ పరిధిలోకి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ రాదని, అందువల్ల దీనికి పర్యావరణ అనుమతులేవీ అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ శుక్రవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)కు నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని తేల్చిచెప్పింది. నిపుణుల కమిటీ కూడా ఇదే అంశంపై ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీకి నివేదికివ్వడం తెలిసిందే. తాజాగా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర పర్యావరణశాఖ తన వైఖరిని స్పష్టంగా తెలియచేసింది. అన్ని విషయాలు పరిగణించాకే... ► తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడికాలువలకు 1994 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం పర్యావరణ అనుమతులిచ్చారు. ఆ అనుమతుల్లో నీటి సరఫరాను పంపింగ్ ద్వారా చేస్తారా? గ్రావిటీ ద్వారా చేస్తారా? అనే ప్రస్తావన లేదు. గాలేరు నగరి సుజల స్రవంతి ఈఐఏ పర్యావరణ అనుమతుల్లో 38 టీఎంసీల నీటి సరఫరా ప్రస్తావన ఉంది. ► తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి సుజల స్రవంతి వేర్వేరు సమయాల్లో ఏర్పాటయ్యాయి. పర్యావరణ, అటవీశాఖ నుంచి వేర్వేరుగా అనుమతులు తీసుకున్నారు. ► ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రివర్ వ్యాలీ, హైడ్రో ప్రాజెక్ట్ నిపుణుల కమిటీ జూలై 29న సమావేశమై చర్చించింది. 2006 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం చర్చలు జరిగాయి. ► అన్ని విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నాక ప్రాథమిక ఆధారాలనుబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని కమిటీ స్పష్టంగా చెప్పింది. తెలంగాణ సర్కారు అభ్యంతరం.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, దీనివల్ల పలు ప్రాజెక్టుల ఆయకట్టుతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీన్ని హరిత ట్రిబ్యునల్ శుక్రవారం మరోసారి విచారించింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి, న్యాయవాదులు దొంతిరెడ్డి మాధురిరెడ్డి, తుషారా జేమ్స్‌లు విచారణకు హాజరవగా, తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు, స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమార్, పిటిషనర్ తరఫున కె.శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. దీనిపై తదుపరి విచారణను ట్రిబ్యునల్ సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అదేరోజు ఏపీ వాదన వింటామని తెలిపింది. -
జల దిగ్బంధనంలో మహానంది ఆలయం
సాక్షి, కర్నూలు: జిల్లాలో గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. బాధితులకు భోజనం, వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాధితులకు ఇబ్బందులు కలుగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు, హనుమంతు గుండం, బి.ఉప్పులూరు గ్రామాలు.. కోవెలకుంట్ల మండలంలోని లింగాల, వల్లంపాడు, ఎం. గోవిందిన్నె, చిన్న కొప్పెర్ల, పెద్ద కొప్పెర్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 6 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. జల దిగ్బంధనంలో మహానంది ఆలయం.. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మహానంది దేవస్థానాన్ని వరద నీరు చుట్టు ముట్టింది. ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. మహానంది కోనేర్లు చెరువులను తలపిస్తున్నాయి. మహానంది ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. మహానందికి వెళ్లే మార్గంలో వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు కారణంగా మహానందిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తప్పిన పెను ప్రమాదం.. వైఎస్సార్ జిల్లా: పాగేరు బ్రిడ్జి మీద పెన్నా,కుందు నదుల నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కమలాపురం-ఖాజిపేట ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చక్రాయపేటలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాయచోటి రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు విరిగి పడిన సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంబంధింత అధికారులు పట్టించుకోకపోవడంతో.. కొందరు యువకులు కొండ చరియలను తొలగిస్తున్నారు. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం.. కర్నూలు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు..నంద్యాల-గిద్దలూరు, గాజులపల్లి-దిగువ మెట్ట మధ్య రైలు మార్గంలో పట్టాలు తెగిపోవడంతో గుంటూరు-గుంతకల్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాగల మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. -
కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం
సాక్షి, నగరి/రేణిగుంట (చిత్తూరు జిల్లా) : 70 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి కొత్త అధ్యాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి లిఖించబోతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు దాదాపు నిండి సముద్రానికి నీరు వెళ్లిపోతోందని.. ఆ నీరు వృథాగా పోకూడదనే ఉద్దే శంతోనే తామిద్దరం చర్చించి సానుకూల నిర్ణయానికి వచ్చామని ఆయన వెల్లడించారు. సోమవారం తమిళనాడు రాష్ట్రం కంచిలోని అత్తివరదరాజస్వామిని సీఎం కేసీఆర్ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా నివాసంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఆయనకు ఎమ్మెల్యే రోజా, పూర్ణ కుంభంతో వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘కంచి దేవస్థానానికి విశేష దర్శనానికి వచ్చాం. దర్శనం బాగా జరిగింది. పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు శ్రద్ధ తీసుకున్నారన్నారు. కుమార్తె ఆర్కే రోజా మంచి ఆతిథ్యమిచ్చారు. అన్నదాత సుఖీభవ. రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరముంది. క్రియాశీలకంగా పట్టుదలతో పనిచేసే యువకుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక తప్పకుండా ఇది సాధ్యమౌతుంది. అన్నగా రాయలసీమ ప్రజల కష్టాలు నాకు తెలుసు. అందుకే 100% నా ఆశీస్సులు, సహకారం ఆయనకు ఉంటుంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిపాం. ఇప్పుడు నీరుంది. సుమారు వెయ్యి టీఎంసీలు గోదావరి నుంచి పోయింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు దాదాపు నిండి సముద్రంలోని నీరువెళ్తోంది. ఆ నీరు అలా వృధాగా పోకూడదని ఆలోచించి నేను, జగన్మోహన్ రెడ్డి చర్చించి సానుకూల నిర్ణయానికి వచ్చాం. 70ఏళ్లలో లేనటువంటి కొత్త అధ్యాయాన్ని నేను, జగన్ కలిసి లిఖించబోతున్నాం. కొందరికి ఇది అర్థం కాకపోవచ్చు, జీర్ణం కాకపోవచ్చు, అజీర్తి కూడా కావచ్చు. ప్రజల దీవెన ఉన్నంత కాలం తప్పకుండా వారి కోరికలు నెరవేరుస్తాం. రాయలసీమను రతనాలసీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు వినియోగిస్తాం’అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం, ఎంఎస్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐఐసీ ౖచైర్‌పర్సన్ రోజా నివాసంలో విందుకు హాజరైన కేసీఆర్ కుటుంబ సభ్యులతోఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు కేసీఆర్‌కు సాదరస్వాగతం అంతకుముందు సీఎం కేసీఆర్‌కు సోమవారం రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కాంచీపురం శ్రీఅత్తి వరదరాజస్వామి దర్శనార్థం ఆయన ప్రత్యేక విమానంలో ఉదయం 11.35గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, ఎంఎస్ బాబు, జిల్లా కలెక్టర్ ఎన్ భరత్ గుప్తా, అర్బన్ ఎస్పీ అన్బురాజన్, ఆర్డీవో కనకనరసారెడ్డి, తహసీల్దార్ విజయసింహారెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శుక్లా, వైఎస్సార్ సీపీ నేతలు భూమన అభినయ్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, పోకల అశోక్ కుమార్, వల్లివేడు ఫృథ్వీరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డుమార్గాన కాంచీపురానికి బయల్దేరి వెళ్లారు. కాంచీపురంలో ఆయనకు ఆలయ అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అత్తి వరదరాజస్వామికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి త్యాగరాజు ప్రసాదాలు అందజేసి సత్కరించారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కవిత, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులున్నారు. వరదరాజస్వామి దర్శనం అనంతరం రాత్రి 7.10గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చేశారు. ఆయనకు విమానాశ్రయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి సారథ్యంలో శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన వేదపండితులు ప్రత్యేక ఆశీర్వచనమిచ్చారు. ఎమ్మెల్యే కేసీఆర్‌కు జ్ఞాపికను బహూకరించారు. కేసీఆర్ కుమార్తె కవితకు పట్టువస్త్రాలు అందజేస్తున్న రోజా. చిత్రంలో కేసీఆర్ సతీమణి శోభ -
సీమలో రేపు, ఎల్లుండి పిడుగులు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమలో మంగళ, బుధవారాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కూడా కురవవచ్చని తెలిపింది. అలాగే రానున్న రెండు రోజులు రాయలసీమలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. మరోవైపు ఈ నెల 18 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు. -
సీమపై వివక్షకు గుణపాఠం తప్పదు
అనంతపురం టౌన్: అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ రాయలసీమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గుంతకల్‌ను రైల్వే జోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 48గంటల నిరాహార దీక్షను ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రాయలసీమ అభివృద్ధికి చేసింది శూన్యం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువతోనే రాయలసీమలో హంద్రీ నీవా నీరు పారుతోందని గుర్తు చేశారు. మొదటి దశలో 95శాతం పనులను గత ప్రభుత్వంలోనే పూర్తి కాగా మిగిలిన 5శాతం పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసి నీళ్లు తామే తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కేంద్రం రూ.50కోట్లు కేటాయిస్తే వాటిని సైతం వినియోగించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అభివృద్ధి మొత్తాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేయరాదని శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు స్పష్టమైన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోందన్నారు. గతంలోనే అసెంబ్లీలో సైతం రాయలసీమ వెనుకబాటుపై స్పీకర్‌కు నోటీసులు ఇచ్చి ప్రస్తావించామని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోరాట ఫలితంగా హంద్రీనీవా, గాలేరు, తెలుగు గంగ ప్రాజెక్టులను నిర్మిస్తామని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రకటించారన్నారు. ఏటా జిల్లాలో కరువు మండలాలను ప్రకటించడమే తప్పా వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అమరావతి, పట్టిసీమపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదన్నారు. ఇదే దోరణిలో వ్యవహరిస్తే రాయలసీమ వాసులు గణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాయలసీమ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. జలసాధన సమితి నాయకులు దశరథరామిరెడ్డి, రామ్‌కుమార్, రాయలసీమ వియోచన సమితి నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రాజేంద్ర, సీమకృష్ణతోపాటు పలువురు పాల్గొన్నారు. -
సీమ ఐజీ నేడు బాధ్యతలు స్వీకరణ
కర్నూలు: రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు స్థానంలో నియమితులైన మహమ్మద్ ఇక్బాల్ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రెండో విడత జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న మహమ్మద్ ఇక్బాల్‌ను గత నెల 29వ తేదీన సీమ ఐజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలులోని పోలీసు గెస్ట్‌హౌస్‌కు ఆయన చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శ్రీధర్‌రావును విజయవాడ హెడ్ క్వాటర్కు నియమించారు. ఆయనకు కూడా వీడ్కోలు పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ స్థానంలో నియమితులైన ఘట్టమనేని శ్రీనివాస్ కూడా రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీనివాసులును కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించిన సంగతి తెలిసిందే. -
డీఐజీ కార్యాలయం ప్రారంభం
కర్నూలు : కర్నూలు శివారులోని బీ.క్యాంపులో ఆధునికీకరించిన డీఐజీ కార్యాలయాన్ని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు పునఃప్రారంభించారు. ఆదివారం స్థానిక కార్యాలయానికి వచ్చిన ఐజీ శ్రీధర్‌రావుకు డీఐజీ రమణకుమార్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఐజీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆధునికీకరించిన డీఐజీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారుల తనిఖీ పుస్తకంలో విజిట్ వివరాలు రాశారు. కార్యాలయ సిబ్బంది పనితీరును పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు, కడప ఎస్పీలు ఆకే రవికృష్ణ, రామకృష్ణ, ఏఆర్ ఏఎస్పీ వెంకటేష్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ మురళీధర్, సీఐలు శ్రీనివాసరావు, బీవీ మధుసూదన్‌రావు, త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు, డీఈ కృష్ణారెడ్డి, డీఐజీ సీసీ కనక నారాయణ, ఆర్ఐ రంగముని, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, డీఐజీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మాతృ సంఘాలతోనే సీపీఎస్ రద్దు
– నూతన సీపీఎస్ సంఘం ఆవిర్భావం తిరుపతి ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరి పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు మాతృ సంఘాల మద్దతుతోనే సాధ్యమని పలువురు పేర్కొన్నారు. తిరుపతిలోని టీపీపీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల వివిధ సంఘాల నాయకులతో నూతన సీపీఎస్ సంఘం తాత్కాలిక యాక్షన్ కమిటీ ఆవిర్భవించింది. ఇందులో రాయలసీమ నుంచి పీవీఆర్.నాయుడు, ప్రభాకర్, రవిశంకర్‌రెడ్డి, దేవానంద్, సమీర్, రమణ, మోహన్, దక్షిణ కోస్తాకు రత్తయ్య, మోజస్, విశ్వనాథ్, కృష్ణారావు, ఉత్తర కోస్తాకు బాలకృష్ణ, పట్టా శ్రీనివాస్, అదనపు బాధ్యులుగా రవికుమార్, లోకేష్, దేవరాజులు, డిల్లీ ప్రకాష్, గురుప్రసాద్, మాధవరెడ్డి, పుల్లారెడ్డి, జానకిరామయ్య, కరుణాకర్, రఘుపతిరెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పెన్షన్ విధానం రద్దుకు అన్ని శాఖల మాతృ సంఘాలను కలుపుకుపోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
నాటకం...జీవన ప్రతిబింబం
–రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు(హాస్పిటల్): మానవ జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలోనే రాష్ట్రస్థాయి నంది నాటక పోటీలు కర్నూలులో నిర్వహించాల్సి ఉన్నా అప్పుడు సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర కోస్తాలో విజయనగరం, దక్షిణ కోస్తాలో గుంటూరు, రాయలసీమలో కర్నూలు కేంద్రంగా ఈ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కళాకారులను ప్రోత్సహించే ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని చరిత్ర చెబుతుందన్నారు. రాయలసీమ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక కళలను, కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద కళాకారులకు కర్నూలులో 10వేల గృహాలను నిర్మిస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున నాటకోత్సవాలను ప్రారంభించం అభినందనీయమని ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో 276 బృందాలు పాల్గొంటున్నాయన్నారు. కళాకారులకు ఇస్కాన్ సంస్థ సహాయంతో భోజనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, మార్కెట్ యార్డు చైర్పర్సన్ శమంతకమణి, ఆర్డీవో రఘుబాబు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, నాటకోత్సవాల నిర్వాహకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చప్పగా సాగిన నాటకోత్సవాలు రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలకు సరైన ప్రచారం లేకపోవడంతో బుధవారం ప్రేక్షకులు లేక చప్పగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు ప్రచారం లేకపోవడంతో కళలపై అభిమానం ఉన్న వారు రాలేకపోయారన్న వాదన వినిపించింది. సాక్షాత్తూ వేదికపై ఉన్న వారు సైతం నాటకాలకు జనం లేకపోవడాన్ని తప్పుబట్టారు. ఆలోచింపజేసిన నాటికలు.. నంది నాటకోత్సవాల్లో భాగంగా స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన సాంఘిక నాటికలు ఆలోచింపజేశాయి. సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలపై ఈ నాటికలను తమ కోణాన్ని చూపాయి. దురాచారాల వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు, ఫలితం గురించి వివరించాయి. మొదటిరోజు ఐదు నాటికలకు గాను నాలుగు మాత్రమే జరిగాయి. కళాకారులు రాకపోవడంతో బ్రతికించండి అనే సాంఘిక నాటికను రద్దు చేశారు. వరకట్న దురాచారంపై బాపూజీ స్కౌట్ గ్రూప్ వారి ‘ఆశా–కిరణ్’ అనే సాంఘిక నాటిక ఆలోచింపజేసింది. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారు చివరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే అంశంపై శ్రీ మురళి కళానిలయం ఆధ్వర్యంలో ‘అం అః–కం కః’ అనే సాంఘిక నాటకం నవ్వుల పువ్వులు పూయించింది. సినీ నటుడు జెన్నీఫర్ ఈ నాటికలో నటించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ‘అగ్నిపరీక్ష’ అనే సాంఘిక నాటకం..మంచి సందేశాన్ని ఇచ్చింది. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను మరిచిపోయే వారు.. చివరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే అంశంపై ప్రభు ఆర్ట్స్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ‘ఐదో దిక్కు’ అనే సాంఘిక నాటకం ప్రదర్శించారు. -
సీమ ప్రజలను మభ్యపెడుతున్న సీఎం
- జీఓ నెం.69ని రద్దు చేయకుండా మోసం చేస్తున్నారు - జాతీయ, రైతుల సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా నంద్యాలరూరల్: సాగునీటి జలాల విషయంలో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. జీఓ నెం.69ని రద్దు చేయకుండా శ్రీశైలం జలాశయంలోని నీటిని రాయలసీమకు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేయడం మోసపూరితమేనన్నారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు ఆవరణలో ‘రాయలసీమకు నీటి భిక్ష కాదు -సాగునీటిపై చట్టబద్ధ హక్కు కావాలి’ అంటూ గురువారం రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభ సమయంలో సీఎం ప్రసంగం పూర్తిగా సత్యదూరమన్నారు. జీఓ నెం.69ని రద్దు చేయకుండా రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయం నుంచి నీరందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జలాశయం నిండుకుండలా ఉన్నా తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, హంద్రీనీవాకు పూర్తిస్థాయిలో నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నికర జలాలున్నా ప్రాజెక్టులకు నీరందకుండా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ధ్వజమెత్తారు. పట్టిసీమ ద్వారా మిగిలిన 45టీఎంసీలు, చింతలపూడి ద్వారా 32టీఎంసీలు, పులిచింతల ద్వారా అదనంగా వచ్చే 54టీఎంసీలు, శ్రీశైలం డ్యాంకు కేటాయించిన క్యారీ ఓవర్ 60టీఎంసీలు మొత్తం 191టీఎంసీలపై రాయలసీమకు చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచి సాగునీటిపై చట్టబద్ధత సాధించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని చేపట్టి కరువుకు శాశ్వత కరువుకు పరిష్కారం చూపాలన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, వేదవతిపై ఎత్తిపోతల పథకం, గురురాఘవేంద్ర ప్రాజెక్టులు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ఉద్యమించి సాగునీటిపై చట్టబద్ధమైన హక్కు సాధించుకుందామని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టం 854అడుగులుండేలా చర్యలు తీసుకోకుంటే సీమ ద్రోహిగా మిగిలిపోతారంటూ సీఎంను హెచ్చరించారు. సదస్సులో రాయలసీమ సాగునీటి సాధన సమితి, సిద్ధేశ్వరం అలుగు సాధన సమితి కన్వీనర్లు ఏర్వ రామచంద్రారెడ్డి, వైఎన్‌రెడ్డి, నంది రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎరబోలు ఉమామహేశ్వరరెడ్డి, నాయకులు వెంకటేశ్వరనాయుడు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎస్ఐ అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టు
– రోజు వెయ్యి మందికి ఆహ్వానం – మొదటి రోజు 687 మంది హాజరు – 519 మంది రాత పరీక్షకు ఎంపిక కర్నూలు: పోలీసు శాఖలో ఎస్ఐ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మ్యాట్రిన్ (మహిళలు) నియామకాలకు సంబంధించి స్క్రీనింగ్ టెస్టు ప్రక్రియ మంగళవారం ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో ప్రారంభమైంది. రాయలసీమ పరిధిలోని కర్నూలు,కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఎస్ఐ కొలువులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ టెస్ట్‌కు హాజరయ్యారు. ఉదయం 5.30 గంటలకే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలైంది. ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టుల సమాచారం ముందుగానే అందజేయడంతో మొదటి రోజు సుమారు 687 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఎత్తు, ఛాతి కొలతలను పరీక్షించారు. అందులో అర్హత సాధించిన వారికి 100, 1600 పరుగు పరీక్షతో పాటు లాంగ్‌జంప్ నిర్వహించారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్ తదితరుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. అప్పీల్‌కు అవకాశం: ఛాతి, ఎత్తు కొలతల పరిశీలనలో (పీఎంటీ) సందేహాలుంటే అభ్యర్థులకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆయా అభ్యర్థులు చివరి రోజు 12వ తేదీ డీఐజీ రమణకుమార్‌కు అప్పీల్ చేసుకుని మరోసారి పీఎంటీకి హాజరు కావచ్చు. పీఎంటీతో పాటు 1600 మీటర్ల పరుగు పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో విడతలో ధ్రువపత్రాలు పరిశీలించి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలకు అనుమతిస్తారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన అనంతపురం, కర్నూలు కేంద్రంగా నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు 10079 మంది పురుషులు, 613 మంది మహిళలకు ఈ నెల 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు సూచనలు: అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు, రెండు జిరాక్స్ సెట్లు తీసుకురావాల్సి ఉంటుంది. – ఛాతి, ఎత్తు కొలతల పరిశీలనలో సందేహాలు ఉంటే అభ్యర్థులు ఈనె 12న అప్పీల్ చేసుకోవచ్చు. – ఎస్ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మ్యాట్రిన్ పోస్టుల్లో ఏదో ఒకదాని కోసమే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1600 మీటర్ల పరుగుతో పాటు, 100 మీటర్ల పరుగు లేదా లాంగ్ జంప్ విభాగాల్లో ఏదో ఒక దాంట్లో అర్హత సాధించాలి. శారీరక కొలతలు, దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 18,19 తేదీల్లో తుది రాత పరీక్ష జరుగుతుంది. మొదటి రోజు ప్రతిభను కనబరిచి 519 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. -
కృష్ణా జలాలు సీమకే కేటాయించాలి
- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముచ్చుమర్రి (పగిడ్యాల): కృష్ణా జలాలను రాయలసీమకే కేటాయించాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ముచ్చుమర్రిలోని తన స్వగృహంలో ఏర్పాటు ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ముచ్చుమర్రిలోని ప్రతి వీధి తిరిగిన చరిత్ర ఉందన్నారు. అయితే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ స్కీంలో వంద శాతం మోటార్లు పనిచేయవని.. కేవలం 500 క్యూసెక్కుల నీరు మాత్రమే కేసీలోకి విడుదల చేస్తూ రాయలసీమ సస్యశ్యామలం అయిపోతుందని ప్రగల్బాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రం ఎగువన అక్రమ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తూ జలదోపిడికి పాల్పడుతున్నా..అరికట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్‌ను నిర్మించాలని సర్వే చేసి రూ. 240 కోట్లకు ప్రతిపాదనలు పంపినా ఫలితం శూన్యమన్నారు. అప్పట్లో 69 జీవోను ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని వెంటనే రద్దు చేయాలన్నారు. సిద్దేశ్వరం, మల్లేశ్వరం మధ్యన అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఫ్రీజోన్ చేసి జనాభా ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యుడు నాగభూషణం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుల్యాల నాగిరెడ్డి, కార్యకర్తలు నారాయణరెడ్డి, కరణం జయరాఘవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీనీవాతో సీమ సస్యశ్యామలం
హాలహర్వి : దివంగత ముఖ్యమంత్రి ఽవైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా సాగు, తాగునీరు అందించి సీమ జిల్లాలను సస్యశ్యామలం చేశారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం ఆయన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో కలిసి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయం, హర్ధగేరి హెల్త్ ఏటీఎంను ప్రారంభించారు. జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనకబడిందని, ఈ ప్రాంత రైతులు వర్షాధారంపై ఏటా పంటలను సాగుచేసి నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కరువు రైతులను ఆదుకునేందుకు దివంగత మహానేత వైఎస్సార్ అప్పట్లోనే హాలహర్వి మండలం గూళ్యం తుంగభద్ర వృథా జలాలను ఆపేందుకు వేదావతి ప్రాజెక్టును నిర్మించేందుకు యత్నించారని, ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గూళ్యం వద్ద దాదాపు రూ.650 కోట్లతో ప్రాజెక్టు చేపడతామని హామీ ఇచ్చారని, ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని హాలహర్వి, హొళగుంద, ఆస్పరి, ఆలూరు మండలాలకు తాగు, సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపేందుకు హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తానని, అందుకు రూ.120 కోట్లు ఖర్చు పెడతానని ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆ ప్రచారాలను కట్టిబెట్టి హంద్రీనీవా ఽద్వారా చెరువులు నింపే కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కేంద్ర పథకాలను తమవిగా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ భీమప్పచౌదరి, ఎంపీపీ బసప్ప, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, జెడ్పీటీసీ సభ్యుడు రేగులరమణ, హర్ధగేరి సర్పంచు తిప్పారెడ్డి, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్, రాష్ట్ర జలవనరుల శాఖ అఫెక్స్ మెంబర్ కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. -
రాయలసీమకు అన్యాయం: నాగిరెడ్డి
కర్నూలు: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమకు అధిక నిధులు కేటాయించి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. పట్టిసీమవల్ల రాయలసీమకు ఒరిగేదేమీ లేదని అన్నారు. పట్టిసీమకు ఇచ్చే నిధులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఇస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని నాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాయలసీమను ఎడారి చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిని ఎడాపెడా వాడేయడం ద్వారా రాయలసీమను ఎడారి చేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పరిస్థితికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లే కారణమని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 800 అడుగులకు పడిపోయిందన్నారు. జలాశయాల నీటిని తాగు, సాగునీటి అవ సరాలు తీరాక, విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాల్సి ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులూ దీన్ని విస్మరించి సీమకు ద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. రిజర్వాయర్‌లో కనీసం 854 అడుగులైనా నీళ్లు లేకుంటే సీమకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. బాబుకు రాయలసీమపై ప్రేమ లేదని, ఆయనదంతా కపట ప్రేమేనని విమర్శిం చారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లిస్తామంటున్న వ్యక్తి ఆ ప్రాంతానికి నీటిని తీసుకువెళ్లేందుకు అవకాశం ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు భారీగా నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. సీమ అభివృద్ధి కోసమే తాను అనంతపురంలో పుట్టిన రోజు పండుగ చేసుకున్నానని సీఎం చెబితే చాలదని, ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించాలన్నారు. పుట్టినరోజులు, బారసాలలు నిర్వహించుకుంటే సీమ అభివృద్ధి జరుగుతుందా? అని ఆయన ఎద్దేవాచేశారు. రాయలసీమలో వచ్చే ఆదాయంతో రాజధాని నిర్మాణాన్ని నిర్మించడంపై మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాయలసీమలో లభించే ఎర్రచందనం వేలం ద్వారా రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతోందని, ఆ మొత్తాన్ని రాజధానికి కాకుండా తమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
విశ్వవిద్యాలయాలకు ‘చంద్ర’ గ్రహణం
యూనివర్సిటీ: కరువు జిల్లాలోని రెండు విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదు. సాంకేతిక విద్యలో రాయలసీమలోనే తలమానికంగా ఉన్న జేఎన్టీయూ ప్రగతికి గండిపడింది. పంపిన ప్రతిపాదనలకు, కేటాయించిన బడ్జెట్‌కు భారీ వ్యత్యాసం ఉండడమే ఇందుకు తార్కాణం. జేఎన్టీయూ పరిధిలోని కలికిరి ఇంజనీరింగ్ కళాశాల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిర్మాణాలలో ఉన్న కలికిరి ఇంజనీరింగ్ కళాశాలకు రూ.200 కోట్లు అవసరం కాగా, ఒక్క నయాపైసా కూడా కేటాయింలేదు. మరో వైపు పులివెందుల ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్టీయూ అనంతపురం కళాశాలలో నిర్మాణాలు, మౌళిక సదుపాయాల కల్పనపై నీలినీడలు కమ్ముకున్నాయి. మెత్తంగా జేఎన్టీయూ విశ్వవిద్యాలయానికి కేవలం రూ 51.32 కోట్లు కేటాయించారు. అటు ఎస్కేయూలో గత ఏడాది రూ.66 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో రూ.52.90 కోట్లు కేటాయించి సరిపెట్టారు. ఇందులో రూ.40 కోట్లు భోదన, భోదనేతర సిబ్బంది జీతాలకు సరిపోతుంది. ఉద్యోగాల భర్తీ సాధ్యమేనా: ఎస్కేయూలో 160, జేఎన్టీయూలో 180 భోదన పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని యిచ్చింది. కానీ వీటికి తాజా బడ్జెట్లో ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. వర్సిటీ అంతర్గత వనరుల నుంచి మాత్రమే ఉద్యోగాల భర్తీకి అయ్యే మెత్తాలను భరించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. జేఎన్టీయూలో గత రిజిస్ట్రార్, వీసీ చొరవతో 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో నుంచే భవన నిర్మాణాలను చేపడుతున్నారు. జేఎన్టీయూ పరిధిలో ఖాళీగా ఉన్న భోదన పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య నూతన వర్సిటీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు అంశాలలో మొండిచేయి చూపడంతో ఉద్యోగాల భర్తీ కష్టసాధ్యమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ఎస్కేయూలో ప్రధాన అంతర్గత వనరు దూరవిద్య విభాగం. ప్రతి ఏటా రూ.25 కోట్ల ఆదాయం వచ్చేది. అయితే తాజాగా మారిన పరిస్థితులను బట్టి దూరవిద్య ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో రాష్ట్రప్రభుత్వం బ్లాక్‌గ్రాంట్స్ మంజూరు చేసే దయాదాక్షిణ్యాలపై భోదన పోస్టుల భర్తీ ఆదారపడి ఉంది.