డీఐజీ కార్యాలయం ప్రారంభం
కర్నూలు : కర్నూలు శివారులోని బీ.క్యాంపులో ఆధునికీకరించిన డీఐజీ కార్యాలయాన్ని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు పునఃప్రారంభించారు. ఆదివారం స్థానిక కార్యాలయానికి వచ్చిన ఐజీ శ్రీధర్‌రావుకు డీఐజీ రమణకుమార్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఐజీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆధునికీకరించిన డీఐజీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారుల తనిఖీ పుస్తకంలో విజిట్ వివరాలు రాశారు. కార్యాలయ సిబ్బంది పనితీరును పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు, కడప ఎస్పీలు ఆకే రవికృష్ణ, రామకృష్ణ, ఏఆర్ ఏఎస్‌పీ వెంకటేష్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ మురళీధర్, సీఐలు శ్రీనివాసరావు, బీవీ మధుసూదన్‌రావు, త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు, డీఈ కృష్ణారెడ్డి, డీఐజీ సీసీ కనక నారాయణ, ఆర్‌ఐ రంగముని, ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు, డీఐజీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.