
సాక్షి, అమరావతి: రాగల మూడు రోజుల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment