ముంచుకొస్తున్న ముప్పు! | Heavy rains for another 2 days: andhra pradesh | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ముప్పు!

Published Mon, Sep 9 2024 4:34 AM | Last Updated on Mon, Sep 9 2024 12:41 PM

Heavy rains for another 2 days: andhra pradesh

2 రోజులుగా ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వానలు  

పలు ప్రాంతాల్లో 10 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతం 

ఉప్పొంగి ప్రవహిస్తున్న వంశధార, నాగావళి, బహుదా.. ఉత్తరాంధ్రలోని విద్యా సంస్థలకు నేడు సెలవు 

కంచరపాలెంలో కొండచరియలు విరిగిపడి కార్లు, బైక్‌లు ధ్వంసం 

జ్ఞానాపురం వద్ద పొర్లుతున్న ఎర్రిగెడ్డ 

విశాఖ – గాజువాక రాకపోకలు బంద్‌ 

అల్లూరి జిల్లాలో మత్స్యగెడ్డ ఉగ్రరూపం.. 

వంద గ్రామాలకు రాకపోకలు నిలిపివేత

అరకులోయ, అనంతగిరి, పాడేరు, లంబసింగి ఘాట్‌ మార్గాల్లో విరిగిపడిన కొండచరియలు  

సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్‌ : వాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తరాం«ధ్ర జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 నుంచి 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గడిచిన 48 గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 168.5 మి.మీ., చీపురుపల్లిలో 167.75 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 158.75, ఆమదాలవలసలో 142 మి.మీ. వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా వై.రామవరంలో 133.5, నెల్లిమర్లలో 129.75 మి.మీ. వర్షపాతం నమోదైంది.

ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మట్టి కోతకు గురవుతోంది. గోపాలపట్నంలోని రామకృష్ణనగర్‌ వద్ద మట్టి కోతకు గురవుతుండటంతో.. 15కు పైగా ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ఇళ్లన్నీ ఖాళీ చేయించి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

కంచరపాలెంలో కొండచరియలు విరిగిపడి.. కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ప్రధాన మార్గమైన జ్ఞానాపురం వద్ద ఎర్రిగెడ్డ పొంగిపొర్లుతుండటంతో రోడ్లు జలదిగ్బంధంలోచిక్కుకున్నాయి. దీంతో విశాఖ నుంచి గాజువాక వైపు రాకపోకల్ని నిలిపేసి.. ప్రధాన రహదారి వైపు మళ్లించారు. జిల్లాలోని 12 మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ విశాఖ పరిధిలోని 81 లోతట్టు ప్రాంతాల్ని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఆదేశాలిచ్చారు. 

జీవీఎంసీలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి 98 వార్డుల్లో పరిస్థితిని ఆమె ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 110 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు గంభీరం రిజర్వాయర్‌ గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. గంభీరం రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 126 అడుగులు కాగా.. ప్రస్తుతం 123.8 అడుగులకు వరద నీరు చేరుకుంది. 50 క్యూసెక్కుల నీరు చేరుతున్న తరుణంలో.. గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.  
వంశధార, నాగావళి, బహుదా ఉగ్రరూపం 

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదాతో పాటు గెడ్డలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద పది గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. జిల్లాలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 వరకు 1461.6 మి.మీ వర్షం కురవగా, ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 620 మి.మీ వర్షం కురిసింది. బెజ్జిపురం వద్ద గడ్డలో వాహనం కొట్టుకుపోయింది.  

 శ్రీకాకుళం పరిధి కల్లేపల్లిలో శనివారం పిడుగుపడి 6 గొర్రెలు మృతి చెందాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చడంతో పాడేరు, పెదబయలు మండలాల్లోని సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకులోయ, అనంతగిరి, పాడేరు, లంబసింగి ఘాట్‌ మార్గాల్లో కొండచరియలు విరిగి పడుతున్నందున ఆదివారం సాయంత్రం నుంచి ఘాట్‌ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. ముంచంగిపుట్టు మండలంలో అత్యధికంగా 72.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

చాపరాయి జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో జలవిహారి సందర్శనను నిలిపివేశారు. జలవిద్యుత్‌ ప్రాజెక్ట్‌లకు నీరందించే డొంకరాయి జలాశయానికి వరద తాకిడి నెలకొంది. ఆదివారం సాయంత్రం నుంచి నాలుగు గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ, జోలాపుట్టు జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో నీటిమట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.  

విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే çపగలు, రాత్రి బస్సు సరీ్వసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తం­గా శనివారం అర్థరాతి నుంచి భారీగా వర్షాలు కురిశాయి. తాండవ రిజర్వాయర్, రైవా­డ, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తేశారు.  

విజయనగరం జిల్లా మడ్డువలస ప్రాజెక్టులోకి 11,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.  అధికారులు ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేశారు. నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. తాటిపూడి జలాశయం గేట్లు ఎత్తి వేసి 350 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు చేయకపోవడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారంతా తుపానులో చిక్కుకుపోయారని   మ­త్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.  

మరబోట్లకు గోపాల్‌పూర్‌ పోర్టులో ఆశ్రయం
భావనపాడు పోర్టులో 6 బోట్లు, సిబ్బందికి ఆశ్రయం 
మహారాణిపేట : ప్రతికూల వాతావరణం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల విశాఖకు చెందిన పలు మరబోట్లు సముద్రంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని గోపాలపూర్, గజ్జాం జిల్లాల్లో పోర్టు లోపలికి అనుమతించకపోవడంతో మరబోట్లు, మత్స్యకారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. దీంతో అక్కడ మరబోట్ల యజమానులు, సిబ్బంది విశాఖలో ఉన్న ఏపీ మరపడవల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.సి.అప్పారావు దృష్టికి తెచ్చారు.

అప్పారావు వెంటనే మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ విజయ కలిసి గోపాలపూర్‌ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సముద్రంలో చిక్కుకున్న 14 మరబోట్లను, మత్స్యకారులకు గోపాలపురం పోర్టులో ఆశ్రయం కలి్పంచాలని కోరారు. దానికి కలెక్టర్‌ సమ్మతించి హార్బర్‌లో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు 14 బోట్లు, సిబ్బంది గోపాలపూర్‌ పోర్టులో ఆశ్రయం పొందినట్టు అప్పారావు తెలిపారు. అలాగే భావనపాడు పోర్టులో 6 మరబోట్లు, సిబ్బంది ఆశ్రయం పొందారని, మిగతా బోట్లకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.  

ఆందోళనలో సిక్కోలు ప్రజలు    
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నాగవాళికి వరద మరింత పెరిగితే తమ పరిస్థితేంటని సిక్కోలు ప్రజలు భయపడిపోతున్నారు. విజయవాడలో వరదలు సృష్టించిన బీభత్సాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య కాలంలో చేసిన ఓ ఘోర తప్పిదం.. జిల్లా కేంద్రాన్ని ముంపు ముప్పు బారిన పడేసింది. వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నాగావళి నదిలో నీటికి అడ్డుకట్ట వేసి, నిల్వ చేసుకునేందుకు శ్రీకాకుళం వద్ద డైక్‌ నిరి్మంచాలని 2017లో చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018లో విశాఖపట్నానికి చెందిన తమ అనుకూల కాంట్రాక్టర్‌కు రూ.4.95 కోట్లతో పనులు అప్పగించింది. సాధారణంగా నదులపై చేపట్టే డైక్‌ నిర్మాణాలను జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, ఇక్కడి పనులను మున్సిపల్‌ వర్క్స్‌ ఇంజనీర్లకు అప్పగించారు.

నేతలు చెప్పినట్టు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు వ్యవహరించి, కాంట్రాక్టర్‌ ఇష్టానికే పనులను వదిలేశారు. దీంతో నాసిరకం పనులు జరిగాయి. ఈ లోగా నాగావళి నదిలోకి భారీ వరద నీరు రావడంతో అప్పట్లో అంతవరకు నిర్మించిన డైక్‌ కొట్టుకుపోయింది. పనులు నాసిరకంగా జరగడం దీనికి ఒక కారణమైతే, ఆ డైక్‌ నిర్మాణానికి ముందు నాగావళి నదీ ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన ప్రాథమిక నిర్మాణాలు చేపట్టకపోవడం మరో కారణంగా చెప్పొచ్చు. నాసిరకం నిర్మాణం, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో భారీ వరదలకు డైక్‌ కొంత భాగం కొట్టుకుపోవడమే కాకుండా మిగిలిన నిర్మాణం కొంతమేర కిందకు దిగిపోయింది. దాని కింద ఇసుక కొట్టుకుపోయింది. 

దానికి తోడు ఎడమ వైపు గట్టు కోతకు గురవడంతో సమస్య జఠిలంగా మారింది. అప్పటి నుంచి నదీ గమనం పూర్తిగా మారిపోయింది. దీన్ని అధిగమించాలంటే ముందు రక్షణ గోడ నిరి్మంచాలి. డైక్‌ సమీపంలో వంద మీటర్ల వరకు రింగ్‌బండ్‌ వేసి రివిట్‌మెంట్‌ లాంచింగ్‌ ఏప్రాన్‌ వేయాల్సి ఉంది. దీంతో మళ్లీ పరిస్థితి మొదటికొచి్చనట్టయింది. డైక్‌ నిర్మాణాన్ని కొత్తగా చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కొట్టుకుపోయిన డైక్‌ను పరిశీలించేందుకు వచి్చన ఇంజనీరింగ్‌ సాంకేతిక బృందమే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాగావళి మరింతగా పొంగి ప్రవహిస్తే నగరంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఇలిసిపురం, రెల్లివీధి, మరికొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ఊహించి నగర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వరదెత్తిన నదులు
సాక్షి, అమరావతి : పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, ఏలేరు నదులు వరదెత్తుతున్నాయి. మహోగ్రరూపం దాల్చి శాంతించినట్లు శాంతించిన కృష్ణమ్మ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల ప్రభావంతో మళ్లీ ఉగ్రరూపం దాలి్చంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా వరదకు మున్నేరు, కట్టలేరు తదితర వాగుల వరద తోడవుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు 4,50,442 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 202 క్యూసెక్కులు వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 4,50,240 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పశి్చమ కనుమల్లో శనివారం, ఆదివారం విస్తారంగా వర్షాలు కురువడంతో కృష్ణాలో ఎగువన వరద మళ్లీ పెరిగింది.

ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల నుంచి 1.10 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి బీమా నుంచి 33 వేల క్యూసెక్కులు జత కలుస్తుండటంతో జూరాల ప్రాజెక్టులోకి 1.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి 34 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.  శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 3.07 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న 2.60 లక్షల క్యూసెక్కులను అదే రీతిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.56 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.03 లక్షల క్యూసెక్కులను  వదులుతున్నారు. 

స్థిరంగా గోదావరి వరద  
గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరంలోకి 6,59,942 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 2,300 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 6,57,642 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భారీ వరద వస్తుండటంతో ఏలేరు రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి 5,775 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నాగావళి, వంశధార పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. శ్రీకా­కుళం జిల్లాలో నారాయణపురం ఆనకట్టలోకి నాగా­వళి నుంచి 18,500 క్యూసెక్కులు చేరుతుండ­గా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక వంశధార నది నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 7,439 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 1152 క్యూసెక్కులను విడుదల చేస్తున్న అధికారులు మిగులుగా ఉన్న 6,287 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement