సాక్షి ప్రతినిధి, కడప: తెలుగువారంతా ఒక్కటే..తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్...అన్న రోజుల నుంచి నాప్రాంతం... మా రాజధాని.. అన్నదమ్ముల్లా విడిపోదాం అంటూ సూక్తులు ఓవైపు, విశాలాంధ్ర కోసం త్యాగాలు చేసిన తామేమైపోవాలంటూ నిలదీత మరోవైపు వెరసి రాయలసీమ, కోస్తాంధ్రలు రగిలిపోతున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఈ పరిస్థితుల్లో తామున్నామంటూ సమస్యకు పరిష్కారం చూపాల్సిన రాజకీయ పార్టీలు అవకాశవాదం వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రజలకు మద్దతుగా నిలవాల్సిన ప్రతిపక్షం రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తూ ఓట్లు కోసం కుయుక్తులు పన్నుతోంది. ఈ దశలో తాము ప్రజాపక్షమేనని సమైక్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఉంచాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల బస్సు యాత్రకు సోమవారం శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్‌కు ఎంపీ సీట్లు సాధించుకోవడమే లక్ష్యమైంది. అందుకోసం తెలుగువారిని రెండుగా చీల్చేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇలాంటి తరుణంలో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ సంసిద్ధమైంది. రాష్ట్ర చరిత్రలో మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు కోసం తానున్నానంటూ మహానేత తనయ షర్మిల సమాయత్తమయ్యారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం తన తండ్రి వైఎస్ నాల్గవ వర్ధంతి సందర్భంగా బస్సు యాత్ర చేపట్టారు. మహానేతకు నివాళులు అర్పించిన షర్మిల ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను చేపట్టారు. జననేత జగనన్న సంధించిన బాణమై మరోమారు కుటిల రాజకీయాలను ఎండగ డుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమించనున్నారు.
త ల్లి వెంట రాగా.....
తల్లి వైఎస్ విజయమ్మ వెంటరాగా ఆత్మీయులు తోడుగా నిలువగా ఇడుపులపాయ నుంచి బస్సు బయలుదేరింది. వేంపల్లె, కడప, రాజంపేట, రైల్వేకోడూరు మీదుగా సాయంత్రానికి తిరుపతి చేరుకున్నారు. అక్కడ సమైక్యవాదులనుద్దేశించి ప్రసంగించారు.షర్మిల బస్సు యాత్ర చేపట్టడాన్ని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు హర్షిస్తున్నారు. యాత్రకు అండదండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
చరిత్రాత్మక ఘట్టం....ఎమ్మెల్యే ఆది
మహానేత తనయ షర్మిల సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమైక్య రాష్ట్రం కోసం బస్సు యాత్ర చేపట్టడం చారిత్రాత్మక ఘట్టంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభివర్ణించారు. షర్మిల యాత్రకు ఆయన తన సంఘీబావం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమైక్యరాష్ట్రం కోసం కట్టుబడి యాత్రను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రోడ్లు మీదకు వస్తున్నారని, కోట్లాదిమంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ప్రజాభీష్టం మేరకు నడుచుకోని కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. షర్మిల యాత్రకు సీమాంధ్ర ప్రజలు సంఘీబావం ప్రకటించాలని ఆయన కోరారు.
మరో చ రిత్రకు శ్రీకారం..
Published Tue, Sep 3 2013 4:33 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement