telugu state
-
తెలుగు ప్రజలపై ప్రభుత్వాల పిడుగులు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాయి. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ సిద్ధం: సజ్జల వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ‘‘ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారు. హామీలు ఇచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్‌కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే జగన్ పరిపాలన తెచ్చారు. అందరం కలిసి ముందుకు సాగుదాం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దాం. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుంది’’విశాఖపట్నం: వైఎస్సార్ జయంతి సందర్భంగా బీచ్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మేయర్ హరి వెంకట కుమారి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు వంటి గొప్ప పథకాలను మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టారన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు వైఎస్సార్‌ను ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకున్నారు. పేదల కోసం పరితపించిన వ్యక్తి వైఎస్సార్. వైఎస్ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్ గత ఐదేళ్లు అమలు చేశారన్నారు.‘‘రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రజల గుండెల్లో నుంచి ఆయనను వేరు చేయలేరు. టీడీపీ నేతలు ధ్వంసం చేసిన విగ్రహాలన్నీ తిరిగి ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుంది. కూటమి నేతల దాడులను ప్రతిఘటిస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.పార్లమెంట్లో వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి‘డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) సామాజిక న్యాయం, సాధికారత, పేదల పక్షపాతిగా కోట్లాది మందికి చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ రోజు వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా పార్లమెంట్లో డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని స్పీకర్ ఓంబిర్లాకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్సార్ శాశ్వత వారసత్వానికి నివాళి అర్పించినట్లు అవుతుంది’ అని ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.Dr. Y.S. Rajasekhara Reddy (YSR) will forever be remembered by crores as a champion of social justice, and empowerment, and an advocate for the poor. On the occasion of his 75th birth anniversary today, I earnestly appeal to the Hon. Speaker, @ombirlakota ji to install a statue…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 8, 2024 తిరుపతి: వైఎస్సార్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నివాసం వద్ద వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.హైదరాబాద్: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, దానం నాగేందర్, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా వికోటలో చిత్తూరు జిల్లా చైర్మన్ జీ శ్రీనివాసులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ, సర్పంచ్ పీఎన్ లక్ష్మమ్మ, ఎంపీపీ యువరాజు, రాష్ట్ర కార్యదర్శి పిఎన్ నాగరాజు, వైస్ ఎంపీపీ తమ్మీఖాన్ , వైస్ సర్పంచ్ అక్మల్ , వికోట మహిళా అధ్యక్షురాలు శశికళ, మంజుల, సరస్వతి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తూర్పుగోదావరి జిల్లా: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఎమ్మెల్సీ అనంతబాబు రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రక్తదానం చేశారు. ఈ కార్యక్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.అల్లూరి సీతారామరాజు: రాజవొమ్మంగిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు.జనగామ: స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్ర పటానికి కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు కేక్ కట్ చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రంజాన్
-
విశాఖ టు శంషాబాద్ ఇక 4.30 గంటలే
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్‌సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది... హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్‌లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగో టర్మినల్‌గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. -
శివన్నామస్మరణలో శైవక్షేత్రాలు (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారత్ బంద్
-
తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి
-
జాడలేని వాన
-
రాత్రి సమయంలోనూ తగ్గని సెగలు
-
నేటి నుంచి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది. -
కిటకిటలాడుతున్న టోల్గేట్లు..
-
తెలుగు రాష్ట్రాలకు తీపికబురు
-
రెచ్చిపోతున్న దొంగలు
-
మరో చ రిత్రకు శ్రీకారం..
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగువారంతా ఒక్కటే..తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్...అన్న రోజుల నుంచి నాప్రాంతం... మా రాజధాని.. అన్నదమ్ముల్లా విడిపోదాం అంటూ సూక్తులు ఓవైపు, విశాలాంధ్ర కోసం త్యాగాలు చేసిన తామేమైపోవాలంటూ నిలదీత మరోవైపు వెరసి రాయలసీమ, కోస్తాంధ్రలు రగిలిపోతున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఈ పరిస్థితుల్లో తామున్నామంటూ సమస్యకు పరిష్కారం చూపాల్సిన రాజకీయ పార్టీలు అవకాశవాదం వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రజలకు మద్దతుగా నిలవాల్సిన ప్రతిపక్షం రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తూ ఓట్లు కోసం కుయుక్తులు పన్నుతోంది. ఈ దశలో తాము ప్రజాపక్షమేనని సమైక్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఉంచాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల బస్సు యాత్రకు సోమవారం శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌కు ఎంపీ సీట్లు సాధించుకోవడమే లక్ష్యమైంది. అందుకోసం తెలుగువారిని రెండుగా చీల్చేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇలాంటి తరుణంలో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ సంసిద్ధమైంది. రాష్ట్ర చరిత్రలో మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు కోసం తానున్నానంటూ మహానేత తనయ షర్మిల సమాయత్తమయ్యారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం తన తండ్రి వైఎస్ నాల్గవ వర్ధంతి సందర్భంగా బస్సు యాత్ర చేపట్టారు. మహానేతకు నివాళులు అర్పించిన షర్మిల ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను చేపట్టారు. జననేత జగనన్న సంధించిన బాణమై మరోమారు కుటిల రాజకీయాలను ఎండగ డుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉద్యమించనున్నారు. త ల్లి వెంట రాగా..... తల్లి వైఎస్ విజయమ్మ వెంటరాగా ఆత్మీయులు తోడుగా నిలువగా ఇడుపులపాయ నుంచి బస్సు బయలుదేరింది. వేంపల్లె, కడప, రాజంపేట, రైల్వేకోడూరు మీదుగా సాయంత్రానికి తిరుపతి చేరుకున్నారు. అక్కడ సమైక్యవాదులనుద్దేశించి ప్రసంగించారు.షర్మిల బస్సు యాత్ర చేపట్టడాన్ని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు హర్షిస్తున్నారు. యాత్రకు అండదండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. చరిత్రాత్మక ఘట్టం....ఎమ్మెల్యే ఆది మహానేత తనయ షర్మిల సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమైక్య రాష్ట్రం కోసం బస్సు యాత్ర చేపట్టడం చారిత్రాత్మక ఘట్టంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభివర్ణించారు. షర్మిల యాత్రకు ఆయన తన సంఘీబావం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమైక్యరాష్ట్రం కోసం కట్టుబడి యాత్రను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రోడ్లు మీదకు వస్తున్నారని, కోట్లాదిమంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ప్రజాభీష్టం మేరకు నడుచుకోని కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. షర్మిల యాత్రకు సీమాంధ్ర ప్రజలు సంఘీబావం ప్రకటించాలని ఆయన కోరారు. -
విభజనపై ఎన్టీఆరే ప్రకటనలు ఇచ్చారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ కోరుకున్న తెలుగుజాతి సమైక్యత కోసం రాజీనామా చేస్తున్నట్టుగా టీడీపీ నేత హరికృష్ణ చెప్పడం పూర్తిగా అవాస్తవమని టీఆర్ఎస్ శాసనసభ్యుడు కె.తారక రామారావు విమర్శించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాలని ఎన్టీఆర్, ఎఎన్నార్ కలసి సంయుక్తంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని వెల్లడించారు. వాటికి సంబంధించిన పత్రికా ప్రతులను ఆయన విడుదల చేశారు. జై ఆంధ్రాకు మద్దతుగా కృష్ణ, విజయనిర్మల వంటివారు ఏకంగా దీక్షలే చేశారని గుర్తుచేశారు. అనేక మంది నటులు విభజనకు అనుకూలంగా ప్రకటనలు చేశారని వివరిం చారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలతో నిరసన చేయిస్తున్న తెలుగుదేశం పార్టీ తన నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకుందని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటుకు టీడీపీ అనుకూలంగా ఉంటే.. పార్లమెంటును అడ్డుకుంటున్న ఆ పార్టీ ఎంపీలను చంద్రబాబు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే విద్వేషాలు లేని విభజనకు సహకరించాలని కేటీఆర్ సూచించారు. నరేంద్రమోడీ కోసం దేశం ఎదురు చూస్తున్నదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అంటే భారతదేశం అనుకున్నామని, ఇప్పుడు టీడీపీ ఎంపీలకు మద్దతు చేయడం చూస్తుంటే తెలుగుదేశం అని అర్థమైపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందేమోనని ఇప్పటిదాకా అనుకున్నామని, వెంకయ్యనాయుడు వ్యవహారంతో ఆ పార్టీపై మరోసారి అనుమానాలు పెరుగుతున్నాయని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఎప్పుడు పెడతారో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.