సీమ ఐజీ నేడు బాధ్యతలు స్వీకరణ | today ig takes charge | Sakshi
Sakshi News home page

సీమ ఐజీ నేడు బాధ్యతలు స్వీకరణ

Published Mon, Jul 3 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

today ig takes charge

కర్నూలు: రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు స్థానంలో నియమితులైన మహమ్మద్‌ ఇక్బాల్‌ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రెండో విడత జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న మహమ్మద్‌ ఇక్బాల్‌ను గత నెల 29వ తేదీన సీమ ఐజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలులోని పోలీసు గెస్ట్‌హౌస్‌కు ఆయన చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శ్రీధర్‌రావును విజయవాడ హెడ్‌ క్వాటర్‌కు నియమించారు. ఆయనకు కూడా వీడ్కోలు పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్‌ స్థానంలో నియమితులైన ఘట్టమనేని శ్రీనివాస్‌ కూడా రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీనివాసులును కర్నూలు రేంజ్‌ డీఐజీగా నియమించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement