mohammad iqbal
-
హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
సాక్షి, హిందూపురం: హిందూపురం వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. ఆధునిక భవనాలు, వసతులతో కూడిన వాణిజ్య, కాయగూరల మార్కెట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల రెండో వారంలో కొత్త మార్కెట్ ప్రారంభానికి ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. వ్యాపారులను చిదిమేసిన టీడీపీ పాలకులు.. దశాబ్దాలుగా ఎందరో వ్యాపారులకు జీవనపాధి కల్పించిన మార్కెట్ సముదాయాన్ని గత టీడీపీ పాలకులు ముందు చూపు లేకుండా కూల్చేసి చిరు వ్యాపారులను రోడ్డున పడేశారు. మల్టీఫ్లస్ త్రీ ఫ్లోర్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో 2016లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి వ్యాపారులను ఖాళీ చేయించి తెల్లారిసరికే పూర్తిగా నేలమట్టం చేసేశారు. 2.24 ఎకరాల్లో రూ.100 కోట్లతో కాంప్లెక్స్‌ను రెండు బ్లాక్‌లుగా విభజించి రెండు సెల్లార్లు, హోల్‌సేల్ మండీలు, రెండో ఫ్లోర్లో కోల్డ్ స్టోరేజీలు, కాయగూరల మార్కెట్, ఆడిటోరియం, ఏసీ గోదాములు, మూడో ఫ్లోర్లో రెండు మల్టీఫ్లక్స్ థియేటర్లు నిర్మిస్తామంటూ గొప్పలకు పోయారు. చివరకు రూ.23 కోట్లతో రెండు ఫ్లోర్లలో గదుల నిర్మాణానికి అనుమతులు తీసుకుని పునాదులకే పరిమితం చేశారు. చదవండి: (ఆ కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేదు: బాలినేని) కల సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మార్కెట్ దుస్థితిని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తీసుకెళ్లారు. రోడ్డున పడ్డ వ్యాపారులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం, మున్సిపాలిటీ, గుడ్‌విల్ మొత్తం రూ.23కోట్ల నిధులతోపాటు మరో రూ.25కోట్లకు పైగా ఖర్చు చేసి ఆధునిక వసతులతో మార్కెట్ సముదాయాల నిర్మాణాలను పూర్తి చేయించారు. దీంతో పట్టణ ప్రజలు, చిరు వ్యాపారుల కల సాకారమైంది. మార్కెట్లోని చాంబర్లు 321 గదులతో సుందరంగా.. నూతనంగా నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని మూడు బ్లాక్‌లుగా విభజించారు. మొత్తం 321 గదుల నిర్మాణం పూర్తి అయింది. ‘ఏ’ బ్లాక్‌లో మొత్తం వాణిజ్య విభాగానికి సంబంధించిన గదులు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 75 షాపులు ఉండగా ఫస్ట్ ఫ్లోర్లో మరో 79 షాపులున్నాయి. ‘బీ, సీ’ బ్లాక్‌లకు సంబంధించి గ్రౌండ్‌ఫ్లోర్‌లో 99 గదులు ఉండగా, ఫస్ట్‌ఫ్లోర్‌లో మరో 68 గదులు ఉన్నాయి. వందలాది వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసేలా ప్రత్యేకంగా విశాలమైన సెల్లార్‌ను ఏర్పాటు చేశారు. కూరగాయల బస్తాల దిగుమతి కోసం భారీ వాహనాలు సైతం సెల్లార్లోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. మార్కెట్లోకి ప్రవేశించేందుకు చుట్టూ ఐదు గేట్లు ఏర్పాటు చేసి, సీసీ రోడ్లు వేశారు. గాం«దీసర్కిల్ వైపున ఉన్న ప్రధాన గేట్ దాటిన తర్వాత అందమైన పార్క్‌తో పాటు వివిధ ఆకృతులను ఏర్పాటు చేస్తున్నారు. 10న ప్రారంభం ఈ నెల 10వ తేదీన మార్కెట్ సముదాయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హిందూపురం వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కెట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. మార్కెట్ వల్ల నెలకు సుమారు రూ.19 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి సమకూరనుంది. ఈ నిధులు పట్టణాభివృద్ధికి దోహదపడతాయి. – వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం చాలా ఆనందంగా ఉంది టీడీపీ పాలనలో వీధిన పడ్డ కాయగూరల వ్యాపారులను ఆదుకునేలా మార్కెట్ నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు, వ్యాపారుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని హంగులతో మార్కెట్‌ను సిద్ధం చేశాం. – మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ సహకారం మరువలేం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు గత మున్సిపాలిటీని ఏలిన టీడీపీ పాలకులు మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పాత మార్కెట్‌ను కూల్చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. అప్పటి నుంచి సరైన వ్యాపారాలు లేక కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చింది. రైతుబజార్, ఎంసీఎం మైదానంలో ఎండకు, వానాలకు నానా ఇబ్బందులు పడ్డాం. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చొరవతో మార్కెట్ నిర్మాణం వేగవంతమైంది. ఇన్నాళ్లకు మా కల నేరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. – చాంద్‌బాషా, కాయగూరల మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి, హిందూపురం -
టీడీపీని బతికించుకునేందుకు దిగజారుడు రాజకీయం
హిందూపురం: వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీని బతికించుకునేందుకే ఆ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి షేక్ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలోని తన క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. దేవాలయాలపై దాడులు చేయిస్తూ టీడీపీ నేతలు మత విద్వేషాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దాడుల వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని డీజీపీ స్పష్టం చేయడంతో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్న, లోకేశ్ తదితరులు భయపడుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తమ నాయకుడు సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి స్పందించారన్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, విద్వేషాలు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఐదేళ్ల కిందటే మతపరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయితే ఇప్పుడు వాటిపైనే విష ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా ఇడియరామపేట రామాలయంలో విగ్రహాలు విరిగిన ఘటన ఎప్పుడో జరిగితే వాటిపై తప్పుడు ప్రచారాలు చేసిన కిలాడ రమేష్, పైలా సత్తిబాబును అరెస్టు చేస్తే అయ్యన్న పాత్రుడి కుమారుడు వెళ్లి కలిశారన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. -
మనసున్న నేత ఇక్బాల్..
సాక్షి, హిందూపురం: వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడికి ఆపన్నహస్తం అందించారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త తిమ్మారెడ్డి. ఆయనకు పక్షవాతం రావడంతో 4 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న ఇక్బాల్ ఆదివారం తిమ్మారెడ్డి ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. చికిత్సల కోసం ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్బాల్ చొరవ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ తిమ్మారెడ్డిని పరామర్శించి ఎలాంటి సాయం అందించకుండా వెళ్లారని పెదవి విరుస్తున్నారు. (చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ) -
‘బాలయ్య హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడు’
సాక్షి, అనంతపురం : సినిమాల్లోలాగా కనుసైగ చేస్తే సుమోలు లేవవనే విషయాన్ని బాలయ్య గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హితవు పలికారు. గురువారం బాలయ్య తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలోకి రాగా.. రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రజా సంఘాలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకుని ‘బాలకృష్ణ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయంపై మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ.. బాలకృష్ణ కనుసైగ చేస్తే ఏమయ్యేది అనడం ఆయన మానసిక స్థితి ఎలా ఉందో తెలియ జేస్తోందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి హిందూపురం బాలయ్య కుటుంబానికి పట్టం కడితే నియోజకవర్గ అబివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రైవేటు కార్యక్రమలకు సంవత్సరానికి రెండు, మూడు సార్లు వచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. బావ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటే బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. హిందూపురానికి తాగునీరు తెచ్చే అమృత్ పథకంలో తెలుగు దొంగల అవినీతి త్వరలో బయట పడుతుందని తెలిపారు. -
ముఖ్య విషయాలను దాచిపెట్టారు: ఇక్బాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు)ను స్వాగతిస్తున్నామని తెలిపారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి ఫలాలు పేదవారికి అందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సహజ వనరులు ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముఖ్య విషయాలను దాచిపెట్టారు.. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ఐకానిక్ బిల్డింగులు అవసరమని గత ప్రభుత్వం ఆలోచించ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. రాజధాని అంశంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆహారలోటు ఏర్పడుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కానీ.. టీడీపీ శివరామకృష్ణన్ కమిటీలో ఉన్న ముఖ్యమైన విషయాలను దాచిపెట్టింది’ అని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అందుకోసం రెండు బిల్లులను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. -
నేను సదా మీ సేవకుడినే - ఎమ్మెల్సీ
సాక్షి, హిందూపురం : ‘‘నేను ఎప్పుడూ హిందూపురం సేవకుడినే...అందరికీ అందు బాటులో ఉంటా. ప్రజా సమస్యల పరిష్కారం...పురం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా’’ అని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి బుధవారం హిందూపురం వచ్చిన ఆయనకు స్థానిక పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చి స్థానిక వైఎస్సార్ పరిగి బస్టాండులోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాధారణ కార్యకర్తగా ఉన్న తనను ఎమ్మెల్సీని చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిదన్నారు. వైఎస్సార్ సీపీతోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిపనిలోనూ ఉద్యోగ, రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే సిద్దాంతాన్ని ఆచరణలో పెడుతున్న నాయకుడన్నారు. ఆయనకు, హిందూపురం వాసులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. అవినీతీ రహిత జవాబు దారీ పాలన అందించడమే తమ నాయకుడి లక్ష్యమన్నారు. ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి అయినా సరే తన ఇంటి తలుపు తట్టవచ్చన్నారు. అభివృద్ధికి సహకరిస్తాం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అభివృద్ధికి చర్యలు తీసుకుంటే తప్పకుండా తమ సహకారం అందిస్తామని ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. అలాకాకుండా నియోజకవర్గాన్ని వదిలి సినిమాలకే పరిమితమైతే ఏం చేయాలో ప్రజలే చేస్తారన్నారు. ఎమ్మెల్సీగా హిందూపురం వాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంతరెడ్డి, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి, మారుతిరెడ్డి, జనార్దనరెడ్డి, ఏ బ్లాక్ కన్వీనర్ ఈర్షద్ అహ్మద్, మండల కన్వీనర్లు శ్రీరామిరెడ్డి, నారాయణస్వామి, ఫైరోజ్, యువజన విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
నిజమైన నాయకుడిని చూస్తున్నా: ఎమ్మెల్సీ
సాక్షి, హిందూపురం: విశ్రాంత ఐజీ, హిందూపురం వైఎస్సార్ సీపీ నేత షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈనెల 14న ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా.. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం పరంగా ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం శాసనమండలి చాంబర్లో రిట్నరింగ్ అధికారి బాలకృష్ణామాచార్యులు ప్రకటించారు. అనంతరం ధ్రువపత్రాన్ని అందజేశారు. దీంతో హిందూపురంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐజీ టూ ఎమ్మెల్సీ.. ఇక్బాల్ ప్రస్తానమిది షేక్ మహమ్మద్ ఇక్బాల్ స్వగ్రామం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల. 1958 ఏప్రిల్ 24న జన్మించిన ఆయన.. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత పోలీసు శాఖలో ప్రవేశించి ఐజీ స్థాయికి ఎదిగారు. విధి నిర్వహణలో నిజాయతీ కల్గిన పోలీస్ అధికారిగా పేరు సంపాదించారు. అంతేగాక రాయలసీమ ఐజీగా ఓవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయల కల్పనకు కృషి చేశారు. విద్యార్థులకు కంప్యూటర్లు, కీడ్రాసామగ్రి, పుస్తకాల పంపిణీ చేశారు. తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు క్రీడాప్రాగంణాలు అభివృద్ధి చేశారు. ఆయన ఐజీగా ఉన్న సమయంలోనే హిందూపురం ప్రాంతంలో కూడా పలు పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూపురం నుంచి పోటీ ముందునుంచీ రాజకీయాలపై ఆసక్తి కల్గిన మహమ్మద్ ఇక్బాల్.. రాయలసీమ ఐజీగా పదవీ విరమణ పొందిన తర్వాత 2018 మే 16న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. రాజకీయ పరిజ్ఞానం మెండుగా ఉన్న మహమ్మద్‌ఇక్బాల్‌పై సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక అభిమానాన్ని చూపారు. ఈక్రమంలోనే 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఎన్నికలకు కేవలం 22 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ తనవంతు కృషి చేశారు. అయినప్పటికీ స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఐదు స్థానాలను మైనార్టీలకు కేటాయించింది. ఇందులో నాలుగు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓటమి చవిచూసిన ఇక్బాల్‌ను కూడా ఎమ్మెల్సీగా చేసి చట్టసభలకు తీసుకువెళ్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో జరిగిన ముస్లింమైనార్టీల సభలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇక్బాల్‌ను ఎమ్మెల్సీగా గెలిపించి తన మాటను నిలబెట్టుకున్నారు. ముబారక్ ఇక్బాల్ సాబ్ రాజకీయ నాయకులకు ఎన్నికల సమయంలోనే మైనార్టీలు గుర్తుకువస్తారు. ఒకటో, రెండో సీట్లు ఇస్తారు. ఓడిపోతే వారివైపు కన్నెత్తి చూడరు. కానీ నేను ఓడినా సోదరభావంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిలో నిజమైన నాయకుడిని చూస్తున్నా. మైనార్టీల సంక్షేమంపై ఆయనకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అన్ని వర్గాలు ఎదగాలని ఆకాంక్షించే నాయకుడి నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. – మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ -
రేనాటిగడ్డకు అరుదైన అవకాశం
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు) : రేనాటిగడ్డగా పేరొందిన కోవెలకుంట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరుదైన అవకాశం కల్పించారు. శాసన మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు యాధృచ్చికంగా కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు నేతలకు దక్కాయి. అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి, కోవెలకుంట్ల విద్యార్థిగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న రాయలసీమ రిటైర్డ్ ఐజీ, అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మహమ్మద్ ఇక్బాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇద్దరూ రేనాటిగడ్డ నేతలే అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా రాజకీయ అరంగ్రేటం చేశారు. 1999, 2004 సార్వత్రిక ఎన్నికల్లో కోవెలకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొంది పదేళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. 2009 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోవెలకుంట్ల నియోజకవర్గం కనుమరుగై బనగానపల్లె నియోజకవర్గంగా మార్పు చెందటంతో ఆ ఎన్నికల్లో అప్పటి పీఆర్పీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చల్లా సేవలను పట్టించుకోకపోవడంతో 2019 ఎన్నికల సమయంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కాటసాని విజయం కోసం కృషి చేయాలని, అందుకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైఎస్ జగన్ చల్లాకు సూచించారు. ఇచ్చిన హామీ మేరకు చల్లాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కోవెలకుంట్ల విద్యార్థి మహమ్మద్ ఇక్బాల్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ కోవెలకుంట్ల పూర్వ విద్యార్థి. ఇదే మండలంలోని కంపమల్ల ఇక్బాల్ తాతగారి ఊరు. మహమ్మద్ ఇక్బాల్ తాత మదార్‌సాహెబ్ 1965–70 మధ్యకాలంలో కోవెలకుంట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తూ మనవడైన మహమ్మద్ ఇక్బాల్‌ను తన వద్ద ఉంచుకుని పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. హైస్కూల్ విద్య బనగానపల్లె మండలం నందివర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసి, ఉన్నత విద్య అనంతరం ఐపీఎస్‌గా కర్నూలు, కడప జిల్లాల్లో విశిష్ట సేవలందించారు. పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. తనకు విద్యనందించిన కోవెలకుంట్ల ప్రాంతంతో ఇక్బాల్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి దక్కనుండటంతో రేనాటిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కస్తూర్బా పాఠశాలను సందర్శించిన మహ్మద్ ఇక్బాల్
సాక్షి, అనంతపురం : డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్కూల్ పిల్లల సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత మహ్మద్ ఇక్బాల్ స్పందించారు. జిల్లాలోని హిందూపురం మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు అహ్మద్ నగర్లో స్కూల్ పక్కనే డంపింగ్ యార్డు ఉంది. గురువారం డంపింగ్ యార్డుకు నిప్పు పెట్టడంతో స్కూల్ పరిసరాలు పొగతో నిండిపోయాయి. ఈ సమస్య కాస్త మహ్మద్ ఇక్బాల్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన వెంటనే స్పందించారు. తక్షణమే డంపింగ్ యార్డును ప్రజావాసాలకు దూరంగా మార్చాలని మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌ని ఫోన్లో కోరారు. సమస్య తీరేవరకూ పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరారు. అలానే హిందూపురం మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించి కంపూట్యర్లు, మైకులు అందజేశారు. అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
ఐటీ గ్రిడ్ డేటా స్కామ్ సూత్రధారి బాబే
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఓటమి భయంతో టీడీపీ దారుణమైన కుట్రలకు పాల్పడుతోందని.. ఐటీ గ్రిడ్ డేటా స్కాం సూత్రధారి సీఎం చంద్రబాబేనని వైఎస్సార్ సీపీ నాయకుడు, రిటైర్డు ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్లు సహజ వనరులతో సహా అన్నింటినీ దోచుకున్న టీడీపీ నేతలు అవినీతి డబ్బును వెదజల్లి గెలవాలని పథకం పన్నారని, ఇది సాధ్యంకాదని తేలడంతో ఇప్పుడు భారీ కుట్రపన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే దాహంతో ఓటర్ల జాబితా నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారుల పేర్లను భారీగా తొలగించేందుకు తెగబడ్డారని ఇక్బాల్ ఆరోపించారు. ఇందుకోసం ఏపీ ప్రజల ఆధార్ వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ అనే ఓ చిన్న సంస్థకు అప్పగించిందన్నారు. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపట్టినట్లు నిపుణుల విచారణలో తేలిందని ఇక్బాల్ చెప్పిరు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని మహ్మద్ ఇక్బాల్ వివరించారు. ఈ వ్యవహారం హైదరాబాద్ కేంద్రంగా జరిగినందునే నగరానికి చెందిన విజిల్ బ్లోయర్ లోకేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఓట్ల తొలగింపు అక్రమాలపై వైఎస్సార్సీపీ కూడా చేసిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టారన్నారు. అనైతిక కార్యకలాపాలు సాగించడానికే సీఎం చంద్రబాబు తన తనయుడికి ఐటీ శాఖ కట్టబెట్టినట్లుందన్నారు. డేటా స్కామ్ బాగోతాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దుచేయాలని ఇక్బాల్ డిమాండు చేశారు. గవర్నరు కూడా దీనిపై దృష్టి సారించాలన్నారు. -
కోడి కత్తో... నారా వారి కత్తో తేలుతుంది
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యాయత్నం కేసులో నిజంగా టీడీపీ నేతల చేతులకు రక్తం అంటక పోతే ఎన్ఐఏ విచారణకు ఆటంకాలెందుకు సృష్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటు పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ సూటిగా ప్రశ్నించారు. ఎన్ఐఏ విచారణతో డొంకంతా కదులుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌పై హత్యాయత్నం జరిగితే... ‘తమ్ముళ్లూ... అది కోడికత్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎగతాళి చేసి మాట్లాడారని, అది కోడి కత్తో... నారా కత్తో త్వరలో తేలుతుందని ఇక్బాల్ హెచ్చరిక చేశారు. ఎన్ఐఏ విచారణకు సహకరించకుండా అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు, డీజీపీ ఇద్దరూ కేసును తప్పు దోవ పట్టించేయత్నం చేశారని ఇక్బాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ ప్రకటనతో గరుడ ఫ్లెక్సీ, మడతలు లేని లేఖను సృష్టించారు కాబట్టే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తే నిజాలు నిగ్గు తేలవని హైకోర్టును ఆశ్రయించామని, ఇది కేంద్రం పరిధిలో ఉందని పౌర, విమానయాన చట్టం ప్రకారం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఎన్ఐఏకి అప్పగించాలని తెలిసినా చంద్రబాబు ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో ఎన్ఐఏకి కేసును అప్పగించక తప్పలేదన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర కోణం ఉందని, నిందితుడు శ్రీనివాసరావును ఎవరెవరు ప్రోత్సహించారో తేలాల్సి ఉందని ఎన్ఐఏ స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు తాను స్వయంగా అబద్ధాలు చెప్పడమే కాక, డీజీపీతోనూ చెప్పించారని, అప్పట్లో వికటాట్టహాసం చేసిన చంద్రబాబు ఇపుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఇక్బాల్ ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరి నేర చరిత్ర కలిగిన శ్రీనివాసరావును ఎలా పనిలో పెట్టుకున్నాడనే దానిపై కూడా ఎన్ఐఏ విచారణ చేపడుతుందని ఇక్బాల్ తెలిపారు. ఇన్ని అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ఇంకా ప్రజలను మభ్యపెట్టి, నయవంచన చేసినట్లు మాట్లాడుతున్నాడంటే ఎక్కడ ఆ కత్తి నారా కత్తిగా మారి తన మెడ మీద వేలాడుతుందోనని భయపడుతున్నాడన్నారు. ఈ కేసులో డొంక కదులుతోందని తెలిసే చంద్రబాబు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకుని లోకేష్‌ను పంపించారని అన్నారు. దర్యాప్తు కొనసాగాలని ఎన్ఐఏ చెబుతుంటే... దర్యాప్తు ముగిసిందని చెప్పడం ఏమిటని మండిపడ్డారు. సీఎంగా వైఎస్ ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకో చంద్రబాబూ! దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలా వ్యవహరించారో చంద్రబాబు గుర్తు చేసుకోవాలని ఇక్బాల్ సూచించారు. పరిటాల రవి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేస్తే వైఎస్ వెంటనే ఆదేశించారన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగినపుడు కనీస బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు ప్రజలకు తన మొహం చూపించే అర్హతే లేదని, ఆయన నల్లగుడ్డ కప్పుకుని ప్రజల ముందుకు రావాలని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళలను ఇప్పటికే చంద్రబాబు మోసం చేశారని, పసుపు–కుంకుమ పేరుతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చినందుకు తల ఎక్కడ పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. -
పీలేరులో టీడీపీకి షాక్!
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ పీలేరు నియోజకవర్గానికి మాజీ ఇన్చార్జీ మైనార్టీ నేత ఇక్బాల్ మహమ్మద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20మంది నేతలు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పాతిక సంవత్సరాలు టీడీపీకి సేవ చేసి ఎంతో నష్టపోయామని ఇక్బాల్ వాపోయారు. 2014లో కిరణ్‌కుమార్ రెడ్డి కుటుంబం మీద పోటీచేయాలని తన మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకవచ్చారని.. అందుకే పోటీచేశానన్నారు. అయితే ఎన్నికల తరువాత అన్నివిధాల ఆదుకొంటామని సీఎం రమేష్ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని అన్నారు. నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్ కుమార్ రెడ్డికి ఇన్చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా.. కార్పోరేషన్ పదవిని కూడా ఇచ్చారన్నారు. సీఎంను కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పానన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాతే చంద్రబాబుకు ముస్లింల పట్ల ప్రేమ కనపడుతోందని విమర్శించారు. తన రాజీనామా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. -
‘నాలుగున్నరేళ్లు అవమానించి ఇప్పుడు ఓట్ల కోసం ఎర’
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు, ఎస్టీలకు నాలుగన్నరేళ్లు మంత్రివర్గంలో స్థానం కల్పించని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముంగిట ఓటు రాజకీయాల్లో భాగంగానే మంత్రి పదవులు ఇచ్చారని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఈ వర్గాల అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదని ఆయన దుయ్యబట్టారు. ముస్లింలను చంద్రబాబు ఎప్పుడూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ వచ్చారన్నారు. ఓట్ల కోసం స్వార్థంతోనే ఎన్నికల ముంగిట తమకు మంత్రి పదవులు ఇచ్చారని తాజాగా మంత్రులైన వారు సైతం వారి అనుయాయుల వద్ద వాపోతున్నారని ఇక్బాల్ చెప్పారు. వైఎస్సార్సీపీ మతతత్వపార్టీతో పొత్తుపెట్టుకోదని ఇక్బాల్ స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యం
-
'పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణం'
సాక్షి, కర్నూలు : హత్తిబెళగల్ క్వారీ ప్రమాదం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ అన్నారు. పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. 10 మంది మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎక్కడైనా దుర్ఘటనలు జరిగిన తర్వాతే ప్రభుత్వం హడావిడి చేస్తోందని ధ్వజమెత్తారు. లోకల్ గవర్నెన్స్ ద్వారానే ప్రభుత్వ శాఖలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనార్టీల వెనకబాటుతనానికి టీడీపీనే కారణమని మహ్మద్ ఇక్బాల్ ధ్వజమెత్తారు. మైనార్టీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుంటోందన్నారు. దేశంలో మైనారిటీ మంత్రిలేని కేబినెట్ టీడీపీ ప్రభుత్వానిదే అని నిప్పులు చెరిగారు. మైనార్టీల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘటన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని కొనియాడారు. వైఎస్ జగన్‌తోనే మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు. -
రాయలసీమ ఐజీగా షేక్ మహమ్మద్ ఇక్బాల్
– శ్రీధర్‌రావు నుంచి బాధ్యతల స్వీకరణ కర్నూలు : రాయలసీమ ఐజీగా నియమితులైన షేక్ మహమ్మద్ ఇక్బాల్ సోమవారం బి.క్యాంప్‌లోని ఐజీ కార్యాలయంలో ఎన్.శ్రీధర్‌రావు నుంచి బాధ్యతలు చేపట్టారు. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న ఈయనను సీమ ఐజీగా నియమిస్తూ గత నెల 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈయన స్వగ్రామం జిల్లాలోని కోవెలకుంట్ల. 1987లో పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులు పొందుతూ ఐజీ స్థాయికి ఎదిగారు. హైదరాబాద్‌లో ఎక్కువ కాలం పనిచేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతో శ్రమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మహమ్మద్ ఇక్బాల్‌ను రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు, స్నేహితులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్‌రావు, కర్నూలు ఎస్పీ గోపీనాథ్‌జట్టి, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు, వైఎస్సార్ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ, ఏపీఎస్పీ రెండవ పటాలం కమాండెంట్ శామ్యూల్ జాన్, కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు, అడిషనల్ ఎస్పీలు షేక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, వెంకటాద్రి, హుసేన్ పీరా, సుప్రజ, ఈశ్వర్‌రెడ్డితో పాటు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల డీఎస్పీలు.. ఐజీకి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్‌రావుకు ఘన వీడ్కోలు ఇప్పటివరకు ఐజీగా ఉన్న శ్రీధర్‌రావు విజయవాడలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం పోలీసు అతిథిగృహంలో రాయలసీమ రేంజ్ పోలీసు అధికారులు ఆయనకు పెద్దఎత్తున సన్మానం చేసి.. ఆత్మీయ వీడ్కోలు పలికారు. డీఐజీకి సన్మానం కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్‌ను విజయవాడ సంయుక్త కమిషనర్‌గా బదిలీ చేయడంతో ఆదివారం రాత్రి రిలీవ్ అయ్యారు. జిల్లా పోలీసు అధికారులు ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. రమణకుమార్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా పనిచేసిన గంటా శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
సీమ ఐజీ నేడు బాధ్యతలు స్వీకరణ
కర్నూలు: రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు స్థానంలో నియమితులైన మహమ్మద్ ఇక్బాల్ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రెండో విడత జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న మహమ్మద్ ఇక్బాల్‌ను గత నెల 29వ తేదీన సీమ ఐజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలులోని పోలీసు గెస్ట్‌హౌస్‌కు ఆయన చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శ్రీధర్‌రావును విజయవాడ హెడ్ క్వాటర్కు నియమించారు. ఆయనకు కూడా వీడ్కోలు పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ స్థానంలో నియమితులైన ఘట్టమనేని శ్రీనివాస్ కూడా రెండు మూడు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీనివాసులును కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించిన సంగతి తెలిసిందే.