
వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు.
సాక్షి, హిందూపురం: వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడికి ఆపన్నహస్తం అందించారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త తిమ్మారెడ్డి. ఆయనకు పక్షవాతం రావడంతో 4 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న ఇక్బాల్ ఆదివారం తిమ్మారెడ్డి ఇంటికెళ్లి ఆయన్ను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. చికిత్సల కోసం ప్రభుత్వ పరంగా సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇక్బాల్ చొరవ చూసి టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ తిమ్మారెడ్డిని పరామర్శించి ఎలాంటి సాయం అందించకుండా వెళ్లారని పెదవి విరుస్తున్నారు. (చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ)