
సాక్షి, అనంతపురం : డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్కూల్ పిల్లల సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత మహ్మద్ ఇక్బాల్ స్పందించారు. జిల్లాలోని హిందూపురం మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు అహ్మద్ నగర్‌లో స్కూల్ పక్కనే డంపింగ్ యార్డు ఉంది. గురువారం డంపింగ్ యార్డుకు నిప్పు పెట్టడంతో స్కూల్ పరిసరాలు పొగతో నిండిపోయాయి. ఈ సమస్య కాస్త మహ్మద్ ఇక్బాల్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన వెంటనే స్పందించారు. తక్షణమే డంపింగ్ యార్డును ప్రజావాసాలకు దూరంగా మార్చాలని మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌ని ఫోన్‌లో కోరారు. సమస్య తీరేవరకూ పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరారు. అలానే హిందూపురం మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించి కంపూట్యర్లు, మైకులు అందజేశారు. అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment