సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా హిందూపురం కౌన్సిలర్లు బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌హన్‌రెడ్డిని కలిశారు. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, హిందూపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దీపికతో కలిసి వీరంతా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను కలిశారు.
ఇటీవల టీడీపీలో చేరిన నలుగురు కౌన్సిలర్లు తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. వైఎస్ జగన్‌ను కలిసి పార్టీ కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ నేతల ప్రలోభాలు, బెదిరింపులకు తామిక తలొగ్గేదిలేదని ఏది ఏమైనా ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్‌సీపీ వెంటే నడుస్తామన్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, హిందూపురం ఇన్‌ఛార్జీ దీపిక, ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు.
కాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూపురం మునిసిపాలిటీలో కౌన్సిలర్లను భయపెట్టి, మభ్యపెట్టి తమ పార్టీలో చేర్చుకుని మునిసిపల్ ఛైర్మన్ స్ధానం దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను భయపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో మల్లిఖార్జున, పరుశురాముడు, రహమత్‌బీ, మణిలు తమ తప్పు తెలుసుకుని తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment