రాయలసీమ ఐజీగా షేక్ మహమ్మద్ ఇక్బాల్
రాయలసీమ ఐజీగా షేక్ మహమ్మద్ ఇక్బాల్
Published Tue, Jul 4 2017 4:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
– శ్రీధర్‌రావు నుంచి బాధ్యతల స్వీకరణ
కర్నూలు : రాయలసీమ ఐజీగా నియమితులైన షేక్ మహమ్మద్ ఇక్బాల్ సోమవారం బి.క్యాంప్‌లోని ఐజీ కార్యాలయంలో ఎన్.శ్రీధర్‌రావు నుంచి బాధ్యతలు చేపట్టారు. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న ఈయనను సీమ ఐజీగా నియమిస్తూ గత నెల 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈయన స్వగ్రామం జిల్లాలోని కోవెలకుంట్ల. 1987లో పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులు పొందుతూ ఐజీ స్థాయికి ఎదిగారు. హైదరాబాద్‌లో ఎక్కువ కాలం పనిచేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతో శ్రమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మహమ్మద్ ఇక్బాల్‌ను రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు, స్నేహితులు మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్‌రావు, కర్నూలు ఎస్పీ గోపీనాథ్‌జట్టి, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు, వైఎస్సార్ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ, ఏపీఎస్పీ రెండవ పటాలం కమాండెంట్ శామ్యూల్ జాన్, కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు, అడిషనల్ ఎస్పీలు షేక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, వెంకటాద్రి, హుసేన్ పీరా, సుప్రజ, ఈశ్వర్‌రెడ్డితో పాటు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల డీఎస్పీలు.. ఐజీకి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీధర్‌రావుకు ఘన వీడ్కోలు
ఇప్పటివరకు ఐజీగా ఉన్న శ్రీధర్‌రావు విజయవాడలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం పోలీసు అతిథిగృహంలో రాయలసీమ రేంజ్ పోలీసు అధికారులు ఆయనకు పెద్దఎత్తున సన్మానం చేసి.. ఆత్మీయ వీడ్కోలు పలికారు.
డీఐజీకి సన్మానం
కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్‌ను విజయవాడ సంయుక్త కమిషనర్‌గా బదిలీ చేయడంతో ఆదివారం రాత్రి రిలీవ్ అయ్యారు. జిల్లా పోలీసు అధికారులు ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. రమణకుమార్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా పనిచేసిన గంటా శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
Advertisement