Rayalaseema IG
-
విద్య, వైద్యం బాగుంటేనే దేశాభివృద్ధి
కదిరి అర్బన్ : విద్య,వైద్యం బాగుంటేనే దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందని రాయలసీమ రీజియన్ ఐజీ షేక్ మహ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల, పట్టణంలోని ఉర్దూ, జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులతో గురువారం ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం,విద్య కలిగి ఉంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తన తండ్రి ఒక స్కూల్ టీచర్ అని అయన స్ఫూర్తితో పాఠశాల విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలని ఇక్కడికి వచ్చానన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడించారు. వారిలో బాగా మాట్లాడిన లతేశ్వరీ అనే 10వ తరగతి విద్యార్థిని పుష్కగుచ్ఛం అందజేసి అభినందించారు. అంతకు మునుపు ఎమ్యెల్యే అత్తార్‌చాంద్‌బాషా,మున్సిపల్ చైర్మన్ సురయాభాను,కమీషనర్ భవాని ప్రసాద్,రాష్ట్ర మహిళా కమీషన్ మెంబర్ పర్విన్‌బాను తదితరులు మాట్లాడారు. అనంతరం కెరీర్ ఫౌండేషన్ పుస్తకాలను పంపిణీ చేశారు.అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని ఉర్దూ మున్సిపల్ హైస్కూల్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారు ఏర్పాటు చేసిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శనను తిలకించారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల కాంపౌండ్ ముందు వాహనాల పార్కింగ్తో తమకు ఇబ్బంది ఉందని విద్యార్థులు ఐజీ దృష్టికి తీసుకెళ్లగా అక్కడికక్కడే వాహానాలను ఆ ప్రాంతం నుంచి తరలించేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్‌రాజు, ఆళియాతో పాటు పలువురు పాల్గొన్నారు. -
రాయలసీమ ఐజీగా షేక్ మహమ్మద్ ఇక్బాల్
– శ్రీధర్‌రావు నుంచి బాధ్యతల స్వీకరణ కర్నూలు : రాయలసీమ ఐజీగా నియమితులైన షేక్ మహమ్మద్ ఇక్బాల్ సోమవారం బి.క్యాంప్‌లోని ఐజీ కార్యాలయంలో ఎన్.శ్రీధర్‌రావు నుంచి బాధ్యతలు చేపట్టారు. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న ఈయనను సీమ ఐజీగా నియమిస్తూ గత నెల 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈయన స్వగ్రామం జిల్లాలోని కోవెలకుంట్ల. 1987లో పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులు పొందుతూ ఐజీ స్థాయికి ఎదిగారు. హైదరాబాద్‌లో ఎక్కువ కాలం పనిచేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ఎంతో శ్రమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మహమ్మద్ ఇక్బాల్‌ను రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు, స్నేహితులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్‌రావు, కర్నూలు ఎస్పీ గోపీనాథ్‌జట్టి, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు, వైఎస్సార్ జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ, ఏపీఎస్పీ రెండవ పటాలం కమాండెంట్ శామ్యూల్ జాన్, కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు, అడిషనల్ ఎస్పీలు షేక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, వెంకటాద్రి, హుసేన్ పీరా, సుప్రజ, ఈశ్వర్‌రెడ్డితో పాటు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల డీఎస్పీలు.. ఐజీకి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్‌రావుకు ఘన వీడ్కోలు ఇప్పటివరకు ఐజీగా ఉన్న శ్రీధర్‌రావు విజయవాడలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం పోలీసు అతిథిగృహంలో రాయలసీమ రేంజ్ పోలీసు అధికారులు ఆయనకు పెద్దఎత్తున సన్మానం చేసి.. ఆత్మీయ వీడ్కోలు పలికారు. డీఐజీకి సన్మానం కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్‌ను విజయవాడ సంయుక్త కమిషనర్‌గా బదిలీ చేయడంతో ఆదివారం రాత్రి రిలీవ్ అయ్యారు. జిల్లా పోలీసు అధికారులు ఆయనను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. రమణకుమార్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా పనిచేసిన గంటా శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి శ్రీకారం
- రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్‌రావు కడప అర్బన్ : రాష్ట్రంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొదటిసారిగా జిల్లాలో టెక్నికల్ అనాలసిస్ వింగ్‌ను ప్రారంభించామని, ఇది చాలా శుభపరిణామమని రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్‌రావు అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్‌రావు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం వరకు ఎన్నికలు, శాంతిభద్రతలపై డీఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ బంగ్లా, క్యాంపు కార్యాలయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘టా’ (టెక్నికల్ అనాలసిస్ వింగ్) కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా నేర పరిశోధనలో, కేసుల దర్యాప్తుల్లో ఎలా ముందడుగు వేయాలో తెలుసుకోవచ్చన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు లక్షల మంది వివిధ నేరాల ప్రవృత్తి కలిగిన వారిని గుర్తించామని, వారు ఎక్కడైనా సరే తనిఖీల సమయంలో తారసపడినా, తమకు అనుమానం వచ్చినా వెంటనే వారి వివరాలను, వేలిముద్రలను నమోదు చేయడం ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. చోరీలు, దోపిడీలను తద్వారా అరికట్టవచ్చన్నారు. నేరాల సమయంలో వివిధ సెల్ఫోన్లను ఉపయోగిస్తూ తాము తెరవెనుక ఉంటూ తప్పించుకుంటూ తిరిగే వారని కూడా టెక్నికల్ అనాలసిస్ వింగ్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు సీడీఆర్తోపాటు వారి వెనుకగల సాంకేతిక ప్రమాణాలతో కూడిన లోపాలను కూడా కనిపెట్టవచ్చన్నారు. ప్రతి పోలీసు వాహనానికి ఇప్పటికే జీపీఎస్ సిస్టమ్ ఉన్నందున వీఎంఎస్ ద్వారా ఆయా పోలీసు అధికారులను నేరాలు జరిగినపుడు గుర్తించి వెంటనే ఆయా ప్రదేశాలకు సకాలంలో చేరుకుని నేరాలను నిరోధించే విధంగా కృషి చేయవచ్చన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ రాష్ట్రంలోనే మొదటిసారిగా డీజీపీ చెప్పిన నెలరోజుల్లోపే టెక్నికల్ అనాలసిస్ వింగ్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయించడం అభినందించదగ్గ విషయమన్నారు. పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికలు: రాయలసీమలో జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కొ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష జరిపి అక్కడి పరిస్థితులను అంచనా వేస్తున్నామన్నారు. పొలిటికల్, ఇతర అనుమానించదగ్గ, గతంలో కేసులు ఉన్న వారిపైన, వారి కదలికలపైన ఇప్పటికే నిఘా ఉంచామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, ఓఎస్డీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
‘ఎర్ర’దొంగల వేటకు ప్రత్యేక దళం
ఎర్రచందనం దొంగల వేటకు తిరుపతిలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 463 మంది సిబ్బందితో ఏర్పాటయ్యే ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్(ఆర్ఎస్ఏఎస్టీఎఫ్)కు రాయలసీమ ఐజీ నేతృత్వం వహించనున్నారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నియంత్రణలోనూ.. డీజీపీ పర్యవేక్షణలోనూ ఈ దళం పనిచేయనుంది. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. * తిరుపతిలో ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు * రాయలసీమ ఐజీ నేతృత్వంలో విధుల నిర్వహణ సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 4.67 లక్షల హెక్టార్లలో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో ఎర్రచందనం వృక్షసంపద విస్తారంగా లభిస్తుంది. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ను సొమ్ముచేసుకునేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దొంగలు తెరలేపారు. రెండు దశాబ్దాలుగా అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికివేసి.. వేలాది టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేశారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 8,500 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి ప్రభుత్వం ఇటీవల టెండర్లు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇటీవల 4,500 టన్నులను అమ్మేం దుకు ఈ-టెండర్ కమ్ వేలంను నిర్వహించిన విషయం విదితమే. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చిత్తూరు, వైఎసార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ప్రభుత్వం ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేసింది. 41 మందికిపైగా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించా రు. కానీ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు మా త్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఏడు నెలల పరిధిలో 585 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడమే అందుకు తార్కాణం. జిల్లాల్లో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 4.67 లక్షల హెక్టార్లలో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో ఎర్రచందనం వృక్షసంప ద విస్తారంగా లభిస్తుంది. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ను సొమ్ముచేసుకునేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దొంగలు తెరలేపారు. రెండు దశాబ్దాలుగా అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికివేసి.. వేలాది టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేశారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 8,500 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి ప్రభుత్వం ఇటీవల టెండర్లు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇటీవల 4,500 టన్నులను అమ్మేం దుకు ఈ-టెండర్ కమ్ వేలంను నిర్వహించిన విషయం విదితమే. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చిత్తూరు, వైఎసార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ప్రభుత్వం ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేసింది. 41 మందికిపైగా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించా రు. కానీ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు మా త్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఏడు నెలల పరిధిలో 585 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడమే అందుకు తార్కాణం. జిల్లాల్లో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఎర్రచందనం అ క్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చునని ప్రభుత్వానికి సూచిం చాయి. నిఘా వర్గాల నివేదిక మేరకు ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ఏర్పాటుచేయాలని డీజీపీ జేవీ రాముడు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 463 మందితో ప్రత్యేక దళం డీజీపీ జేవీ రాముడు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆర్ఎస్ఏఎస్టీఫ్లో ఒక నాన్ కేడర్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు(సివిల్), నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు(సివిల్), రిజర్వు ఇన్స్పెక్టర్లు ఇద్దరు, ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 42 మంది కానిస్టేబుళ్లు(సివిల్), 20 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు.. ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, 60 మంది కానిస్టేబుళ్లతో మూడు జిల్లా స్పెషల్ పార్టీలు.. అటవీ, గనులు భూగర్భ వనరులశాఖకు చెందిన సిబ్బంది మొత్తం 463 మంది ఉద్యోగులతో ప్రత్యేక దళం ఏర్పాటుకు నవంబర్ 25న ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక దళం ప్రధాన కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటుచేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసే బాధ్యతను అటవీశాఖకు ప్రభుత్వం అప్పగించింది. చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వద్ద ప్రత్యేక దళం ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉందని సమాచా రం. ఆర్ఎస్ఏఎఫ్టీఎఫ్కు అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఙానాన్ని సమకూర్చే బాధ్యతను హోం శాఖకు అప్పగించారు. నిఘా నుంచి దాడుల వరకు.. రాయలసీమ ఐజీ నేతృత్వంలో పనిచేసే ఈ ప్రత్యేక దళం జిల్లాల పోలీసులతో నిమిత్తం లేకుండా శేషాచలం, లంకమల, పాలకొండ, వెలిగొండ అడవుల్లో కూంబింగ్ చేపడుతుంది. ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా వేస్తుంది. స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం వస్తే రాష్ట్రంలో ఎక్కడైనా దాడులు చేసే అధికారాన్ని ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది. డీజీపీ పర్యవేక్షణలో సీమ ఐజీ ఈ ప్రత్యేక దళాన్ని సమన్వయపరుస్తారు. స్మగ్లర్లను అరెస్టు చేయడం నుంచీ వారికి శిక్ష పడేలా చేయడం వరకూ ఈ ప్రత్యేక దళం కృషి చేస్తుంది. సమన్వయలోపం వల్ల ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోందని.. ఇప్పుడు పోలీసు, అటవీశాఖ సిబ్బందితో ప్రత్యేక దళం ఏర్పాటుచేయడం.. వాటికి చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డీజీపీలు నేతృత్వం వహించడం వల్ల ఎర్రదొంగల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చునని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.