ఎర్రచందనం దొంగల వేటకు తిరుపతిలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 463 మంది సిబ్బందితో ఏర్పాటయ్యే ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్(ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్)కు రాయలసీమ ఐజీ నేతృత్వం వహించనున్నారు. చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నియంత్రణలోనూ.. డీజీపీ పర్యవేక్షణలోనూ ఈ దళం పనిచేయనుంది. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
* తిరుపతిలో ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
* రాయలసీమ ఐజీ నేతృత్వంలో విధుల నిర్వహణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 4.67 లక్షల హెక్టార్లలో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో ఎర్రచందనం వృక్షసంపద విస్తారంగా లభిస్తుంది. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ను సొమ్ముచేసుకునేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దొంగలు తెరలేపారు.
రెండు దశాబ్దాలుగా అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికివేసి.. వేలాది టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేశారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 8,500 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి ప్రభుత్వం ఇటీవల టెండర్లు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇటీవల 4,500 టన్నులను అమ్మేం దుకు ఈ-టెండర్ కమ్ వేలంను నిర్వహించిన విషయం విదితమే.
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చిత్తూరు, వైఎసార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ప్రభుత్వం ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేసింది. 41 మందికిపైగా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించా రు. కానీ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు మా త్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఏడు నెలల పరిధిలో 585 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడమే అందుకు తార్కాణం.
జిల్లాల్లో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 4.67 లక్షల హెక్టార్లలో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో ఎర్రచందనం వృక్షసంప ద విస్తారంగా లభిస్తుంది. ఎర్రచందనం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్‌ను సొమ్ముచేసుకునేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు దొంగలు తెరలేపారు.
రెండు దశాబ్దాలుగా అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను అడ్డంగా నరికివేసి.. వేలాది టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేశారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 8,500 టన్నుల ఎర్రచందనం అమ్మకానికి ప్రభుత్వం ఇటీవల టెండర్లు నిర్వహించడానికి సిద్ధమైంది. ఇటీవల 4,500 టన్నులను అమ్మేం దుకు ఈ-టెండర్ కమ్ వేలంను నిర్వహించిన విషయం విదితమే.
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చిత్తూరు, వైఎసార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ప్రభుత్వం ఎక్కడికక్కడ టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటుచేసింది. 41 మందికిపైగా ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించా రు. కానీ.. ఎర్రచందనం అక్రమ రవాణాకు మా త్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. ఏడు నెలల పరిధిలో 585 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్ల నుంచి పోలీసులు, అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడమే అందుకు తార్కాణం.
జిల్లాల్లో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఎర్రచందనం అ క్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చునని ప్రభుత్వానికి సూచిం చాయి. నిఘా వర్గాల నివేదిక మేరకు ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్ ఏర్పాటుచేయాలని డీజీపీ జేవీ రాముడు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
463 మందితో ప్రత్యేక దళం
డీజీపీ జేవీ రాముడు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఫ్‌లో ఒక నాన్ కేడర్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు(సివిల్), నలుగురు సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు(సివిల్), రిజర్వు ఇన్స్‌పెక్టర్లు ఇద్దరు, ఆరుగురు సబ్ ఇన్స్‌పెక్టర్లు, ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 42 మంది కానిస్టేబుళ్లు(సివిల్), 20 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు.. ముగ్గురు సబ్ ఇన్స్‌పెక్టర్లు, ముగ్గురు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, 60 మంది కానిస్టేబుళ్లతో మూడు జిల్లా స్పెషల్ పార్టీలు.. అటవీ, గనులు భూగర్భ వనరులశాఖకు చెందిన సిబ్బంది మొత్తం 463 మంది ఉద్యోగులతో ప్రత్యేక దళం ఏర్పాటుకు నవంబర్ 25న ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.
ఈ ప్రత్యేక దళం ప్రధాన కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటుచేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేసే బాధ్యతను అటవీశాఖకు ప్రభుత్వం అప్పగించింది. చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వద్ద ప్రత్యేక దళం ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉందని సమాచా రం. ఆర్‌ఎస్‌ఏఎఫ్‌టీఎఫ్‌కు అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఙానాన్ని సమకూర్చే బాధ్యతను హోం శాఖకు అప్పగించారు.
నిఘా నుంచి దాడుల వరకు..
రాయలసీమ ఐజీ నేతృత్వంలో పనిచేసే ఈ ప్రత్యేక దళం జిల్లాల పోలీసులతో నిమిత్తం లేకుండా శేషాచలం, లంకమల, పాలకొండ, వెలిగొండ అడవుల్లో కూంబింగ్ చేపడుతుంది. ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా వేస్తుంది. స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం వస్తే రాష్ట్రంలో ఎక్కడైనా దాడులు చేసే అధికారాన్ని ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వం కట్టబెట్టింది. డీజీపీ పర్యవేక్షణలో సీమ ఐజీ ఈ ప్రత్యేక దళాన్ని సమన్వయపరుస్తారు. స్మగ్లర్లను అరెస్టు చేయడం నుంచీ వారికి శిక్ష పడేలా చేయడం వరకూ ఈ ప్రత్యేక దళం కృషి చేస్తుంది.
సమన్వయలోపం వల్ల ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోందని.. ఇప్పుడు పోలీసు, అటవీశాఖ సిబ్బందితో ప్రత్యేక దళం ఏర్పాటుచేయడం.. వాటికి చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డీజీపీలు నేతృత్వం వహించడం వల్ల ఎర్రదొంగల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చునని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
‘ఎర్ర’దొంగల వేటకు ప్రత్యేక దళం
Published Tue, Dec 30 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement