రాయలసీమను విభసిస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్: రాయలసీమను విభసిస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై సీడబ్యూసీ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని ఆయన తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కర్నూలును రాజధానిగా వదులుకున్నామన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని చారిత్రాత్మక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలని తులసీ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు తెలంగాణపై నిర్ణయం తీసుకున్న అనంతరంసీమాంధ్రలో సమైక్యాంధ్రా ఉద్యమ నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి.