
'సీమకు అన్యాయం చేస్తే ఊరుకోం'
కడప : రాయలసీమకు అన్యాయం చేస్తే సహించేది లేదని రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. కడప బ్రహ్మణీ, ఐటీ హబ్కు కృషి చేస్తానన్న హామీని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని ఆయన సోమవారమిక్కడ డిమాండ్ చేశారు. కడప, బెంగళూరు రైల్వేలైన్కు సహకరించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
గాలేరు-హంద్రినీవాకు జాతీయ హోదా కల్పించాలన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ తరహాలో ఆంధ్రప్రదేశ్కు రెండు రాజధానులు చేయాలని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎప్పటికైనా రాష్ట్రం మళ్లీ ఒక్కటవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.